Breaking
Tue. Nov 18th, 2025

బస్సును ఢీ కొన్న కారు.. ఓ ఇంజినీర్ విద్యార్థి మృతి.. ఇద్ద‌రికి గాయాలు

రోడ్డు ప్ర‌మాదం, ఓఆర్ఆర్, హైద‌రాబాద్, ఇద్ద‌రు మృతి, తెలంగాణ‌, నెహ్రూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు , Road accident, ORR, Hyderabad, two killed, Telangana, Nehru Outer Ring Road,

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Road accidenet: పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్ వద్ద ఆదివారం ఉదయం ఎన్ హెచ్-65పై బస్సును కారు ఢీకొనడంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. హైదరాబాద్ లోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థుల బృందం కారులో గోవా పర్యటనకు వెళ్లింది. తిరిగి హైదరాబాద్ కు వెళ్తుండగా అదే దిశలో వెళ్తున్న ప్ర‌యివేటు బస్సును కారు ఢీకొట్టింది.

మృతుడిని జయసాయి (21)గా గుర్తించారు. కారులో ఉన్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కారు వివరాలను ఆన్ లైన్ లో తనిఖీ చేసినప్పుడు సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో మూడు ర్యాష్ డ్రైవింగ్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరువు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ఒక ప్ర‌యివేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్ర‌మాదం కేసు న‌మోదుచేసుకుని విచార‌ణ జ‌రుపుతున్న‌ట్టు తెలిపారు.

Related Post