Rohit Sharma: సిక్సుల వీరుడు రోహిత్ శ‌ర్మ‌.. క్రిస్ గేల్ రికార్డు బ‌ద్ద‌లు..

Rohit Sharma
Rohit Sharma

దర్వాజ-ముంబయి

ICC World Cup 2023 semifinal: భార‌త్-న్యూజీలాండ్ మ‌ధ్య జ‌రుగుతున్న ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 మ్యాచ్ లో మూడో సిక్సర్ కొట్టడం ద్వారా వన్డే ప్రపంచకప్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు ప్రపంచకప్ లో రోహిత్ ఖాతాలో 50 సిక్సర్లు ఉన్నాయి. వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ (49 సిక్సర్లు) రికార్డును బద్దలు కొట్టాడు. రోహిత్ కు ఇది మూడో వరల్డ్ క‌ప్. గతంలో 2015, 2019 వన్డే ప్రపంచకప్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు.

ప్రపంచకప్ పవర్ ప్లేలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ ప్రపంచకప్ పవర్ ప్లేలో 19 సిక్సర్లు బాదాడు. కివీస్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ రికార్డును రోహిత్ అధిగమించాడు. 2015 ప్రపంచకప్ లో పవర్ ప్లేలో మెక్ కల్లమ్ 17 సిక్సర్లు బాదాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్ మ‌న్ గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ సీజన్లో 28 సిక్సర్లు బాదాడు. గత మ్యాచ్ లో గ్లెన్ మ్యాక్స్ వెల్ (22 సిక్సర్లు) రికార్డును రోహిత్ అధిగమించాడు.

Related Post