దర్వాజ-ముంబయి
ICC World Cup 2023 semifinal:ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో నాలుగు సార్లు టాస్ గెలిచిన టీంఇండియా ప్రతి మ్యాచ్ లో గెలిచింది. ఈ టోర్నమెంట్ లో టీమ్ ఇండియా నాలుగు సార్లు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి నాలుగు మ్యాచ్ ల్లో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లండ్ పై భారత్ 100 పరుగుల తేడాతో, శ్రీలంకపై 302 పరుగుల తేడాతో, దక్షిణాఫ్రికాపై 243 పరుగుల తేడాతో, నెదర్లాండ్స్ పై 160 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ సెమీఫైనల్స్ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ప్లేయింగ్-11లో ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు టీమ్ ఇండియా, కివీస్ తమ ప్లేయింగ్-11లో ఎలాంటి మార్పులు చేయలేదు.
ఇరు జట్ల వివరాలు ఇలా ఉన్నాయి..
భారత్:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.
వన్డే ప్రపంచకప్ లో టీమిండియా ఎనిమిదోసారి, న్యూజిలాండ్ తో తొమ్మిదోసారి సెమీఫైనల్స్ ఆడుతున్నాయి. టోర్నీలో ఇరు జట్లు వరుసగా రెండోసారి సెమీఫైనల్లో తలపడుతున్నాయి.