దర్వాజ-హైదరాబాద్
Independence Day 2023: ప్రగతి భవన్ లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. 77 వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్).. జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో సిఎంవో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాలుపంచుకున్నారు. ప్రగతి భవన్ అధికారులు, సిబ్బంది మిఠాయీలు పంచుకుంటూ సంబురాలు చేసుకున్నారు.
77వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు. జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించిన సీఎం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎంఓ అధికారులు, ప్రజా ప్రతినిధులు. #IndependenceDay2023 🇮🇳 pic.twitter.com/vRzEqeQD1h
— Telangana CMO (@TelanganaCMO) August 15, 2023