- ఢిల్లీలో కొనసాగుతున్న కరోనా మరణ మృదంగం
దర్వాజ-న్యూఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ పంజా విసురుతోంది. కల్లోలం రేపుతున్న కరోనా మహమ్మారి అక్కడ మరణ మృదంగం మోగిస్తున్నది. నిత్యం రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా స్మశాన వాటికలకు కరోనా మృతదేహాల తాకిడి పెరిగింది. దీంతో కరోనా డెడ్ బాడీలు దహన సంస్కారాల కోసం క్యూ లైన్ ఉండాల్సిన దారుణ పరిస్థితి దాపురించింది.
ఈ సమస్యను అధిగమించడానికి అక్కడి అధికారులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్మశాన వాటికలకు కరోనా శవాల తాకిడిని అధిగమించేందుకు ఢిల్లీలోని దర్వార వద్ద ఉన్న శునకాల స్మశాన వాటికలో మానవ మృతదేహాల అంత్యక్రియలు నిర్వహించాలని ఢిల్లీ బల్దియా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో తాత్కాలికంగా చితి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
కాగా, ఢిల్లీ గత 24 గంటల్లో కొత్తగా 25,986 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 368 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాలు 15,377కు పెరిగాయ. పాజిటివ్ కేసులు 10,98,051కి చేరాయి.
Share this content: