దర్వాజ-హైదరాబాద్
Telangana Rains: హైదరాబాద్ సిటీని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ముఖ్యంగా దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పేర్కొంది. ఈ క్రమంలోనే రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
వివరాల్లోకెళ్తే.. గురువారం నాడు హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అలాగే, రానున్నరెండు రోజుల్లో రాష్ట్రంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు పలు జిల్లాల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
మరోవైపు ఉత్తర కర్ణాటకలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
Read More…
బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత తనయుడు అనిల్.. ఏకే అంటోని రియాక్షన్ ఇదే.. !
కరోనా వైరస్ విజృంభణ.. భారీగా కొత్త కేసులు నమోదు
జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ మహ్తో మృతి
హనుమాన్ జయంతి.. అలర్ట్ అయిన తెలంగాణ పోలీసులు !