దర్వాజ-న్యూఢిల్లీ
Covid-19: నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా వైరస్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 2,994 కోవిడ్ కేసులు, తొమ్మిది మరణాలు నమోదయ్యాయని తెలిపింది. అలాగే, కోవిడ్-19 రోజువారీ పాజిటివిటీ రేటు 2.09 శాతానికి పెరిగింది.
కొత్తగా సంభవించిన కోవిడ్-19 మరణాలు ఢిల్లీలో రెండు, కర్నాటకలో రెండు, పంజాబ్ లో రెండు, గుజరాత్ లో ఒకటి, కేరళలో రెండు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 9 మరణాలతో కలిపి దేశంలో మొత్తం కరనా వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,30,876 కు చేరుకుంది. అలాగే, మొత్తం కేసుల సంఖ్య 4,47,18,781కు పెరిగింది. యాక్టివ్ కేసులు 16,354 గా ఉన్నాయి.
కరోనా వైరస్ రోజువారీ పాజిటివిటీ రేటు 2.09 శాతంగా ఉండగా, కోవిడ్-19 రికవరీ రేటు 98.77 శాతంగా ఉంది. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. అలాగే, మొత్తం కోవిడ్ ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.04 శాతంగా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 220.66 కోట్ల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్లను పంపిణీ చేశారు.
Read More…
రక్షణ రంగ సంస్కరణల ఫలితమే ఎగుమతుల పెరుగుదల.. : ప్రధాని నరేంద్రం మోడీ
గుడ్ న్యూస్.. తగ్గిన కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు
అవినీతి సర్కారు.. బీఆర్ఎస్ పై జేపీ నడ్డా తీవ్ర విమర్శలు
చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీ
IPL 2023: అద్దిరిపోయేలా ఐపీఎల్ ఒపెనింగ్ సెరమనీ.. అర్జిత్ సింగ్ తన పాటలతో మైమరపించేశారు.. !
కర్నాటక ఎన్నికలు.. బరిలో నిలిచే ఆప్ అభ్యర్థుల రెండో జాబితా ఇదే..