ట‌ర్కీకి భార‌త్ సాయం.. భూకంప సహాయక సామగ్రితో బ‌య‌లుదేరిన భార‌త బృందం

Arindam Bagchi, India, earthquake , Turkey , dog squads, medical supplies, Narendra Modi, Syria,

Turkey earthquake : భూకంపంతో అతలాకుత‌ల‌మైన ట‌ర్కీకి సాయం చేయ‌డానికి భార‌త్ ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే అక్క‌డి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డానికి తొలి బ్యాచ్ ను పంపించింది. భూకంప సహాయక సామగ్రితో భార‌త‌ తొలి బ్యాచ్ బ‌య‌లుదేరింద‌ని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. టర్కీకి సహాయం చేయడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్లు, వైద్య సామాగ్రి, డ్రిల్లింగ్ యంత్రాలు స‌హా ఇతర అవసరమైన పరికరాలను పంపించారు. ఇదే విష‌యాన్ని వెల్ల‌డిస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి టర్కీకి బయలుదేరిన వివ‌రాల‌ను పంచుకున్నారు.

భారీ స్థాయిలో ప్ర‌కంప‌న‌లు రావ‌డంతో ట‌ర్కీతో పాటు స‌రిహ‌ద్దు దేశాలు సైతం తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌య్యాయి. ట‌ర్కీ, సిరియాలో ప‌రిస్థితులు దారుణంగా మారాయి. భూకంపం ధాటికి ఇప్ప‌టికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారు. ఇప్ప‌టికే 4000 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయార‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ట‌ర్కీకి సాయం చేయ‌డానికి భార‌త్ అన్ని విధాలుగా ముందుంటుంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌క‌టించారు. ఎన్డీఆర్ఎఫ్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ కలిసి భూకంప బాధిత దేశానికి తొలి బ్యాచ్ సహాయక సామగ్రి బయలుదేరిందని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఈ బృందంలో శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్లు, వైద్య సామాగ్రి, డ్రిల్లింగ్ యంత్రాలు స‌హా ఇతర అవసరమైన పరికరాలను పంపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. కాగా, టర్కీ ప్రెసిడెంట్ రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ దేశంలో 7 రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు.

Related Post