Breaking
Tue. Nov 18th, 2025

జాతీయ స్ఫూర్తి నింపేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు.. నంగునూర్ లో ఘ‌నంగా ఫ్రీడమ్‌ రన్‌

indpendence diamond jubilee celebrations, telangana, india,azadi ka amruthmahostav, Freedom Run, Nangunoor, Siddipet, Independent India, Diamond Festival,

ద‌ర్వాజ‌- సిద్దిపేట్

Nangnoor-siddipet: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా నంగునూర్ మండ‌ల కేంద్రంలో ఫ్రీడమ్‌ రన్‌ను (Freedom Run) ఘనంగా నిర్వ‌హించారు. మండ‌ల కేంద్రంలోజరిగిన రన్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, విద్యార్థులు, గ్రామ ప్ర‌జ‌లు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరిలో స్వాతంత్య్ర స్ఫూర్తి చాటేలా, జాతీయ దృక్పథంతో ఎందరో అమరులు చేసిన త్యాగాలు స్మరిస్తూ వజ్రోత్సవాల వేళ పరుగు పెట్టారు. ఘనంగా నిర్వహించిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాలు పంచుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో మండ‌ల తహాసీల్దార్ భార్గ‌వ్ సాగ‌ర్, ఎంపీడీవో వేణుగోపాల్, రాజ‌గోపాల్ పేట ఎస్సై మ‌హిపాల్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మ‌న్ కోల ర‌మేశ్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, మాజీ ఎంపీటీసీ చౌడుచ‌ర్ల జైపాల్ రెడ్డి, ఎంపీటీసీ బెదురు తిరుప‌తి, తెరాస గ్రామ‌శాఖ అధ్య‌క్షుడు ఉల్లి చిన్నమ‌ల్ల‌య్య యాద‌వ్, కో ఆషన్స్ సభ్యులు రహీం పాషా, తెరాస నాయకులు సతీష్ గౌడ్, లాయ‌ర్ సిరికొండ మ‌ణి, ర‌చ్చ సిద్దు, ఆర్. వెంక‌ట్ రెడ్డి, ర‌జినీక‌ర్ రెడ్డి, రాజ‌గోపాల్ పేట్ పోలీసు సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related Post