దర్వాజ-ఇండోర్
Indoor Tragedy-Death Toll Reaches 35: శ్రీరామ నవమి రోజున మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ఆలయంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆలయంలోని బావిలో భక్తులు పడిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 35కు పెరిగింది. ఇప్పటివరకు 14 మందిని రక్షించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ఉన్న బీలేశ్వర్ మహాదేవ్ ఆలయంలోని మెట్లబావి పైకప్పు కూలిపోవడంతో చాలా మంది అందులో పడిపోయారు. శ్రీరామనవమి సందర్భంగా భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం ఉన్న బావి పైకప్పు కూలిపోయింది. ఈ క్రమంలోనే వారు బావిలో పడిపోయారు. పటేల్ నగర్ లో ఉన్న బీలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండగా 14 మందిని రక్షించారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య 35కు పెరిగింది. మరణాలు ఇంకా పెరిగే అవకాశముందని సమాచారం.