• వందల మందికి తీవ్ర గాయాలు
• మృతుల సంఖ్య పెరిగే అవకాశం
దర్వాజ-అంతర్జాతీయం
Afghanistan bomb blast: ఆఫ్ఘానిస్థాన్ బాంబు పేలుడుతో మరోసారి దద్దరిల్లింది. కుందుజ్ నగరంలో మసీదును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 50 మందికి పైగా చనిపోయారని జియో న్యూస్ నివేదించింది. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.
పేలుగు జరిగిన ప్రాంతంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడివున్న దృశ్యాలు అందరిని కలచివేస్తున్నాయి. ఈ పేలుడును ఆఫ్ఘాన్ ఇంటీరియర్ మినిస్ట్రీ ప్రతినిధి క్వారీ సయీద్ ఖోస్తి ధ్రువీకరించారు. అయితే, పేలుడుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందన్నారు. కాగా, శుక్రవారం కావడంతో ప్రజలు భారీగా వచ్చి ప్రార్థనలు చేస్తున్న సమయంలో పేలుడు సంభవించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పాకిస్థాన్‌లో భూకంపం 22 మంది మృతి
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడే కారు నడిపాడు: గాయపడ్డ రైతు
బ్లాక్ ఫంగస్.. ప్రపంచంలోని మొత్తం కేసుల్లో 71 శాతం భారత్‌లోనే..
రైతులపైకి దూసుకెళ్లింది మా కారే.. : కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర
బొగ్గు సంక్షోభంతో కరెంట్ కష్టాలు..
నిలిచిపోయిన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్..
అఫ్ఘాన్‌లో బాంబు దాడి.. 14 మంది మృతి