• రష్యాలో నిత్యం వేయికి పైగా మరణాలు
• భారత్ లో మళ్లీ పెరుగుతున్న కోవిడ్-19 మరణాలు
దర్వాజ-అంతర్జాతీయం
COVID-19 coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. పలు దేశాల్లో కరోనా మళ్లీ పంజా విసురుతుండటంతో ఆంక్షల దిశగా ముందుకు సాగుతున్నాయి. అన్ని దేశాల్లో కలిపి నిత్యం 7 లక్షలకు పైగా కరోనా కేసులు, 10 వేలకు పైగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం నాటికి వరల్డోమీటర్ కరోనా డాష్‌బోర్డ్ వివరాల ప్రకారం.. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 50,07,85కు పెరిగింది. పాజిటివ్ కేసులు సంఖ్య 24.69 కోట్లకు చేరింది. కేసులు, మరణాల్లో అమెరికా, భారత్, బ్రెజిల్, యూకే, రష్యా, టర్కీ, ఫ్రాన్స్, ఇరాన్, అర్జెంటీనా, స్పెయిన్ దేశాలు టాప్-10లో ఉన్నాయి. తాజాగా రష్యాలో 40 వేలకు పైగా కొత్త కేసులు, వేయికి పైగా మరణాలు నమోదయ్యాయి.
భారత్‌లోనూ..
మన దేశంలోనూ కరోనా మరణాలు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా రెండు వందలకు లోపు కరోనా మరణాలు సంభవిస్తుండగా, వారం నుంచి నిత్యం 500లకు పైగా కరోనా మరణాలు చోటుచేసుకుంటుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడిరచిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 14,313 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 549 మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 3,42,60,470కి పెరిగాయి. మరణాలు 4,57,740కి చేరాయి. ప్రస్తుతం 1,61,555 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు వైరస్ బారినపడ్డవారిలో 3,36,41,175 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.19 శాతానికి, మరణాల రేటు 1.34 శాతానికి చేరింది. దేశంలో కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్,ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఢల్లీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, గుజరాత్‌లు టాప్‌లో ఉన్నాయి.
హసరంగా హ్యాట్రిక్.. గెలుపు సౌతాఫ్రికాది !
నెలరోజులకు పైగా ఉగ్రరూపంలో లావా వెదజల్లుతున్న అగ్నిపర్వతం
Aryan Khan Drugs Case_ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ మంజూరు
పెగాసస్_దేశ ప్రజాస్వామ్యంపై దాడి !
ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ దొరికేనా…?
నేను బీజేపీ ఎంపీని.. ఈడీ నా జోలికి రాదు
Ind Vs Pak : భారత్-పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్