దర్వాజ-అంతర్జాతీయం
Malala Yousafzai: 17 ఏండ్ల వయస్సులోనే అతిపిన్న వయస్సుగల నోబెల్ గ్రహితగా ప్రసిద్దికెక్కిన మలాలా యూసఫ్ జాయ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. నిరాడంబరంగా బర్మింగ్ హమ్ లో తన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య మంగళవారం మలాలా పెళ్లి జరిగింది. తన భర్త అసర్ మాలిక్ ను పరిచయం చేస్తూ 24 ఏండ్ల మలాల తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాతో పంచుకున్నారు. ‘‘నా జీవితంలో ఈ రోజు ఎంతో ముఖ్యమైనది.
నేను, అసర్ మాలిక్ జీవిత భాగస్వాములమయ్యాం. బర్మింగ్ హమ్ లో ఉన్న మా నివాసంలో ఇరు కుటుంబాల మధ్య మా నిఖా నిరాడంబరంగా జరిగింది. మీ ఆశీస్సులను కోరుతున్నాం. భార్యాభర్తలుగా మా కొత్త ప్రయాణం కలిసి కొనసాగించడానికి సంతోషంగా ఉన్నాం’’ అని మాలాలా యూసఫ్ ట్వీట్ చేశారు. అలాగే తమ పెళ్లి ఫోటోలను మాలాల పంచుకున్నారు.
మలాలా పాకిస్థాన్ లోని స్వాత్ లోయలో జన్మించింది. ఈమె ఉగ్రవాదుల దాడులు, ఆరాచాకాలపై, బాలికల విద్య కోసం ఎంతో పోరాటం చేశారు. దాంతో తాలిబన్లు 2012 లో ఈమె ప్రయాణిస్తున్న స్కూల్ బస్సులోకి చొరబడి మలాలాపై కాల్పులు జరపడంతో మాలాలకు శరీరంపై తీవ్రగాయాలు, ఆమె ఎడమ కణతిపై బలంగా గాయాలయ్యాయి. బ్రతకడమే కష్టం అనుకున్న మలాలా బ్రిటన్ లో అనేక శస్త్రచికిత్సలు పొంది అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. అయినా మాలాలా బాలికల చదుకోసం, వారి ఎదుగుదల కోసం ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు. కాగా ఆమె చేస్తున్న సేవలకు 2014 లో మలాలా నోబెల్ బహుమతిని అందుకున్నారు.
IFFI Awards 2021: ఎక్కాడా తగ్గేదే లే అంటున్న సంమంత..
Tamil Nadu Rain: తమిళనాడు భారీ వర్షాలతో 12 మంది మృతి
RRR: రామ్ చరణ్, ఎన్టీఆర్ ‘నాటు’ డ్యాన్స్ అదిరింది!
Gold Prices: బంగారం కొనాలనుకునేవారికో గుడ్ న్యూస్..
Hindi: మాకు హిందీ తెలియదు.. సీఎస్‌ను మార్చండి !
వామ్మో.. టూత్ పేస్ట్ తో పిల్లలకు ఇంత డేంజరా?
Crime : క్షణికావేశం.. తీసింది భర్త ప్రాణం..