Loading Now
CPJ report

కలంపై కత్తిపోటు !

• జ‌ర్న‌లిస్టుల ప్రాణాలు తీస్తున్న‌రు..
• ప్రపంచవ్యాప్తగా పెరుగుతున్న జైలు నిర్బంధాలు
• గతంలో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక మంది జైలుకు
• స్వత్రంత్ర రిపోర్టింగ్‌పై పెరుగుతున్న అసహనం: సీపీజే రిపోర్టు

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

Committee To Protect Journalists: ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులను నిర్బంధించడం, వారిపై దాడులు చేయడం, ప్రాణాలు తీయడం వంటి చర్యలు అధికమవుతున్నాయని Committee To Protect Journalists (సీపీజే) నివేదిక పేర్కొంది. ఏడాదికేడాది ఈ ధోరణి క్రమంగా పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. జైలు పాలవుతున్న పాత్రికేయుల సంఖ్య 2021లో గరిష్టంగా పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. జర్నలిస్టులపై దాడులు, నిర్బంధాలకు సంబంధించిన అంశాలు ఒక్కొదేశంలో ఒక్కొ విధంగా ఉన్నప్ప‌టికీ.. మొత్తంగా ఆయా దేశాల్లో ప్రభుత్వాల లోపాలు, స్వతంత్ర రిపోర్టింగ్‌ చేయడం అనే అంశం ప్రధానంగా కనిపిస్తున్నది.

ప్రపంచవ్యాప్తంగా జైలు శిక్షను అనుభవిస్తున్న పాత్రికేయుల సంఖ్య ఈ ఏడాదిలో అత్యధికంగా ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి డిసెంబర్‌ 1 వరకు తీసుకున్న డేటా ప్ర‌కారం మొత్తం 293 మంది జర్నలిస్టులు నిర్బంధించబడ్డారు.వారు అందించిన వార్తల కవరేజీ కారణంగా దాడికి గురై 24 మంది జర్నలిస్టులు మరణించారు. మరో 18 మంది జర్నలిస్టులు వారి వృత్తి కారణంగా వారి ప్రాణాలు తీశారా? లేదా వారికి లక్ష్యంగా చేసుకుని చంపారా? అనేది నిర్ధారించడం కష్టంగా మారింది. 250 మందికి పైగా జర్నలిస్టులను జైలుపాలు చేయడం వరుసగా ఇది ఆరో ఏడాది అని సీపీజే గణాంకాలు పేర్కొంటున్నాయి.

దేశాల్లో రాజకీయ, ప్ర‌భుత్వ వైఫల్యాలు, పలు ఘటనలపై స్వతంత్ర రిపోర్టు చేయడంతోటి జర్నలిస్టులను జైలులో పెట్టడం అనేది పాత్రికేయంపై పెరుగుతున్న అసహనాన్ని ప్రతిబింబిస్తున్న‌ద‌ని సీపీజే నివేదిక పేర్కొంది. జర్నలిస్టులను అధికంగా రికార్డు స్థాయిలో జైలు నిర్బంధంలో పెట్టడం సీపీజే గుర్తించడం ఇది వరుసగా ఆరో ఏడాది అని సీపీజే ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జోయెల్‌ సైమన్‌ ఒక ప్రకటన‌లో తెలిపిన‌ట్టు రాయిట‌ర్స్ నివేదించింది. ప్రభుత్వ సమాచారాన్ని నిర్వ‌హించ‌డం, నియంత్రించం అనే రెండు అంశాలే వారిని క్లిష్ట పరిస్థితుల్లోకి దించుతున్నాయని ఆయన అన్నారు.

CPJ-report-1024x576 కలంపై కత్తిపోటు !

సీపీజే నివేదిక ప్రకారం అత్యధికంగా చైనాలో 50 మందికి పైగా జర్నలిస్టులను ఖైదు చేశారు. ఆ తర్వాతి స్థానంలో మయన్మార్‌ (26), ఈజిప్ట్‌ (25), వియత్నాం (23), బెలారస్‌ (19) దేశాలు ఉన్నాయి. మొదటి సారి సీపీజే జాబితాలో హాంగ్‌ కాంగ్‌లో ఖైదు చేయబడిన జర్నలిస్టులు ఉన్నారు. ఇక మెక్సికోలో క్రిమినల్‌ ముఠాలు, అవినీతి అధికారుల చర్యలను జర్నలిస్టులు కవర్‌ చేసినప్పుడు వారిపై దాడులు జరగడంతో పాటు ఖైదు కూడా చేయబడుతున్నారు. పశ్చిమార్థ గోళంలోనే మెక్సికో జర్నలిస్టులకు అత్యంత దారుణమైన దేశంగా నిలిచిందని సీపీజే నివేదిక పేర్కొంది.

ఈ ఏడాదిలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల దారుణాలు కవర్‌ చేయడానికి వెళ్లిన భార‌త జ‌ర్న‌లిస్టు డానిష్‌ సిద్ధిఖీని ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఇదే తరహాలో మెక్సికోలో గుస్తావో సాంచెజ్‌ కాబ్రెరాను కాల్చిచంపారు. భారత్‌కు చెందిన మరో జర్నలిస్టు అవినాష్‌ జా (బీఎన్‌ఎన్‌ న్యూస్‌) మెడికల్‌ మాఫియాను కవర్‌ చేసినందుకు బీహార్‌లో ఆయన ప్రాణాలు తీశారు. సుదర్శన్‌ టీవీకి చెందిన మనీష్ కుమార్‌ సింగ్ ఉగ్రవాద చర్యలను కవర్‌ చేయడంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇక జ‌ర్న‌లిస్టుల‌పై ఒత్తిడి తీసుకురావ‌డం, ఖైదు చేయ‌డం, దాడులు, చంప‌డం వంటి చ‌ర్య‌లు పెరుగుతున్నాయ‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read:

నిద్రలో పళ్లు కొరుకుతున్నారా..? అయితే ఇలా చేయండి..

Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు

AFSPA రద్దు చేయండి.. ఈశాన్య భార‌తంలో నిరసనలు

కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు

ఈటల రాజేందర్ భూకబ్జా నిజమే: మెదక్ కలెక్టర్

బీజేపీలో చేరేందుకు సిద్దమైన తీర్మాన్ మల్లన్న.. ఎప్పుడంటే?

అందరికి ఉన్నవే నాకు ఉన్నయ్.. హాట్ ఫోటో షూట్ పై పాయల్ ఘాటు సమాధానం..

భార్యను చంపనీకే ఏకంగా క్షుద్రపూజలే చేసాడు.. ఆఖరికి ఏమైందంటే..?

Share this content:

You May Have Missed