Breaking
Sat. Jun 28th, 2025

IPL 2022 Final: ఆడిన ఫ‌స్ట్ సీజ‌న్ లోనే ఐపీఎల్ టైటిల్ గెలిచిన గుజ‌రాత్ టైటాన్స్

IPL 2022 Final, GT vs RR, Hardik Pandya, Shubman Gill, Gujarat Titans, IPL Title, IPL 2022, ఐపఎల్‌ 2022 ఫైనల్, గుజ‌రాత్ vs రాజ‌స్థాన్‌, హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, గుజరాత్ టైటాన్స్, ఐపీఎల్ టైటిల్, ఐపీఎల్ 2022, రాజ‌స్థాన్ రాయ‌ల్స్, బ‌ట్ల‌ర్,

ద‌ర్వాజ‌-క్రీడ‌లు
Gujarat Titans Win Maiden IPL Title : గుజరాత్ టైటాన్స్ ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి తమ తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను గెలుచుకుంది. విజయానికి 131 పరుగులు చేయాల్సి ఉండగా, గుజ‌రాత్ ఏడు వికెట్లు తేడాతో 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. శుభ్‌మాన్ గిల్ అజేయంగా 45 పరుగులు చేయగా, డేవిడ్ మిల్లర్ కూడా 19 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అంతకుముందు, హార్దిక్ పాండ్యా త‌న బౌలింగ్ తో గుజ‌రాత్ గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు. మొద‌ట టాస్ గెలిచి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను గుజ‌రాత్ 20 ఓవ‌ర్ల‌లో 130 పరుగులకు పరిమితం చేసింది. జోస్ బట్లర్ 35 బంతుల్లో 39 పరుగులతో రాణించ‌గా.. మిగ‌తా బ్యాట‌ర్స్ చేతులెత్తేశారు. దీంతో RR 130/9 (20) తో ఇన్నిగ్స్ ను ముగించింది. గుజ‌రాత్ బౌల‌ర్స్ లో హార్దిక్ పాండ్యా (కెప్టెన్) 3 వికెట్లు, సాయి కిషోర్ రెండు వికెట్లు తీసుకున్నారు.

130 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. GT 133/3 (18.1). 11 బంతులు మిగిలుండ‌గానే ల‌క్ష్యాన్ని ఛేదించింది. శుభ‌మ‌న్ గిల్ 45 ప‌రుగులు, డెవిడ్ మిల్ల‌ర్ 32 ప‌రుగులు, హ‌ర్ధిక్ పాండ్య 34 ప‌రుగులు చేశారు. కాగా, ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన మొద‌టి సీజ‌న్ లోనే గుజ‌రాత్ టైటాన్స్ ఐపీఎల్‌2022 టైటిల్ ను గెలుచుకోవ‌డం విశేషం.

IPL-2022-Final-1024x576 IPL 2022 Final: ఆడిన ఫ‌స్ట్ సీజ‌న్ లోనే ఐపీఎల్ టైటిల్ గెలిచిన గుజ‌రాత్ టైటాన్స్

రెండు టీంల వివ‌రాలు ఇలా ఉన్నాయి..

రాజస్థాన్ రాయల్స్ XI: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్ & wk), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, ఆర్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఒబెడ్ మెక్‌కాయ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ

గుజరాత్ టైటాన్స్ XI: శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్), మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ

Related Post