Breaking
Tue. Nov 18th, 2025

IPL 2023: తొలిపోరుకు అంతా సిద్ధం.. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్

Indian Premier League, Sunrisers Hyderabad, Cricket News, IPL 2023, Uppal, Rajasthan Royals, రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, హైద‌రాబాద్, ఉప్ప‌ల్ స్టేడియం, క్రికెట్, ఐపీఎల్, ఇండియాన్ ప్రీమీయర్ లీగ్,

ద‌ర్వాజ‌-క్రీడ‌లు

Sunrisers Hyderabad vs Rajasthan Royals: హైద‌రాబాద్ లోని ఉప్పల్ లో ఉన్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ఐపీఎల్ 2023 సీజ‌న్ కోసం రంగం సిద్ధ‌మైంది. ఇక్క‌డ జ‌రిగే మ్యాచ్ ల‌కు సంబంధించి అన్ని విధాల కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. మొద‌టి మ్యాచ్ హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఆదివారం మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇప్ప‌టివ‌ర‌కు సాగిన ఐపీఎల్ సీజ‌న్ల‌ను గ‌మ‌నిస్తే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఒక్క‌సారి ఛాంపియ‌న్ గా నిలిచింది. నాలుగు సార్లు వ‌రుస‌గా ప్లేఆఫ్స్‌కు చేరింది. అయితే, లాస్ట్ రెండు సీజ‌న్ల‌లో SRH దారుణంగా విఫ‌ల‌మైంది. పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌ర‌లో నిలిచింది. అయితే, ప్ర‌స్తుత సీజ‌న్ లో గతేడాది రన్నరప్‌గా నిలిచిన రాజస్థాన్‌ రాయల్స్ (Rajasthan Royals) తో పోటీ ప‌డ‌నుంది. అయితే, ఉప్ప‌ల్ స్టేడియంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (Sunrisers Hyderabad) కు మెరుగైన ట్రాక్ రికార్డు ఉంది. దీనిని కొన‌సాగించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

ఆదివారం జ‌రిగే మ్యాచ్ కు సంబంధించి తుది జట్ల అంచ‌నాలు గ‌మ‌నిస్తే.. హైద‌రాబాద్ జ‌ట్టులో గ్లెన్‌ ఫిలిప్స్ , భువనేశ్వర్‌ కుమార్, హ్యారీ బ్రూక్, మయాంక్‌ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, అబ్దుల్‌ సమద్, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అదిల్‌ రషీద్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ లు ఉంటే అవ‌కాశ‌ముంది. అలాగే, రాజ‌స్థాన్ జ‌ట్టు అంచ‌నాలు గ‌మ‌నిస్తే.. సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదుత్ పడిక్కల్, హెట్మెయర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, అశ్విన్, చాహల్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ లు ఉంటే అవ‌కాశ‌ముంది.

IPL 2023 సీజ‌న్ కు సిద్ద‌మైన ఉప్ప‌ల్ స్టేడియం..

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం ఐపీఎల్ 2023 సీజ‌న్ కోసం సిద్ధమైంది. పోలీసులు గ‌ట్టి భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకున్నారు. స్టేడియంలోకి ప్రేక్షకులను డే మ్యాచ్‌లకు మ్యాచ్‌ ప్రారంభానికి 3గంటల ముందు నుంచి అనుమ‌తిస్తారు. నైట్ జ‌రిగే మ్యాచ్ ల‌కు 4.30గంటల నుంచి అనుమ‌తించ‌నున్నారు.

Read More…

క‌రోనా విజృంభ‌ణ‌: మ‌ళ్లీ మూడు వేలు దాటిన కోవిడ్-19 కొత్త కేసులు

IPL 2023లో భారీ సిక్సర్.. 100 మీట‌ర్లు దాటిన ఫ‌స్ట్ సిక్స్ ఎవ‌రు కొట్టారంటే.. ?

తెలంగాణ కంటి వెలుగు.. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు కోటీ మందికి కంటి ప‌రీక్ష‌లు

PBKS vs KKR : ఆరంభంలోనే కోల్ క‌తాను దెబ్బ‌కొట్టిన అర్ష్‌దీప్‌ సింగ్‌..

భార‌త్ లో 2.09% పెరిగిన కోవిడ్-19 పాజిటివిటీ రేటు.. కొత్త‌గా ఎన్ని కేసులు న‌మోద‌య్యాయంటే..?

https://darvaaja.com/biggest-six-in-ipl-2023-who-hit-the-first-six-that-crossed-100-meters/

Related Post