Breaking
Tue. Nov 18th, 2025

ఫుట్‌బాల్ స్టేడియంలో ఘర్షణ.. 129 మంది మృతి

Jakarta, football, stadium, 127 people died, Indonesia, Kanjuruhan Stadium, Malang,జకార్తా, ఫుట్‌బాల్, స్టేడియం, 127 మంది మృతి, ఇండోనేషియా, కంజురుహాన్ స్టేడియం, మలాంగ్, అభిమానులు,

ద‌ర్వాజ‌-అంత‌ర్జాతీయం

జకార్తా: ఇండోనేషియాలో శనివారం రాత్రి జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అల్లర్లు చెలరేగడంతో 129 మంది మరణించారు. మృతుల్లో చిన్నారులు, పోలీసు అధికారులు కూడా ఉన్నారు. సాకర్ మ్యాచ్ ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్‌లోని మలాంగ్‌లోని కంజురుహాన్ స్టేడియంలో జరిగింది. అరేమా ఫుట్‌బాల్ క్లబ్‌ను వారి సొంత మైదానంలో వారి బద్ధ ప్రత్యర్థులు పెర్సెబయా ఓడించడం వలన వారి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పిచ్‌పైకి దూసుకెళ్లారు. ఈ క్ర‌మంలోనే సామూహిక అల్లర్లు చెలరేగాయి. అల్ల‌ర్లు, తొక్కిసలాట కార‌ణంగా 100 మందికి పైగా ఫుట్‌బాల్ అభిమానులు, ఇద్దరు పోలీసు అధికారులు సంఘటన స్థలంలో మరణించార‌ని అక్కడి స్థానిక మీడియా నివేదించింది.

జనాలను చెదరగొట్టడానికి సంఘటన స్థలంలో టియర్ గ్యాస్ విడుదల చేయడంతో పొగ క‌మ్ముకుపోయింది. ఈ క్ర‌మంలోనే అక్క‌డి నుంచి ఫుట్ బాల్ అభిమానులు తప్పించుకోవ‌డానికి ప్ప్రయత్నించినప్పుడు తొక్కిస‌లాట‌లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అధికంగా ఉంద‌ని సంబంధిత ఘ‌ట‌న దృశ్యాల ద్వారా తెలుస్తోంది.

Related Post