దర్వాజ-ముంబయి
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో కార్గిల్ వార్ హీరో దీప్‌చంద్, నటి మోనా అంబేగావ్కర్ పాలుపంచుకున్నారు. హర్యానాలోని హిస్సార్‌కు చెందిన నాయక్ దీప్‌చంద్ 1999 కార్గిల్ యుద్ధంలో టోలోలింగ్ వద్ద ఒక చేయి, రెండు కాళ్లను కోల్పోయారు.
వివరాల్లోకెళ్తే.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కార్గిల్ యుద్ధ వీరుడు నాయక్ దీప్‌చంద్, నటి మోనా అంబేగావ్కర్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. శుక్రవారం మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలో వారు పాలుపంచుకున్నారు.
దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ద్రాస్‌ను సందర్శించిన సందర్భంగా ఆయనను “కార్గిల్ యోధా” అని కొనియాడినట్లు కాంగ్రెస్ పేర్కొంది. నాయక్ దీప్‌చంద్ ఆదర్శ్ సైనిక్ ఫౌండేషన్‌లో చురుకుగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో వికలాంగులకు గురైన సైనికుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. నటులు అంబేగావ్కర్ కూడా కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో పాలుపంచుకున్నారు.
Kargil War Hero Deepchand walked with Rahul ji for Unity of India today
— Anjana (@Tinyhunterme) November 18, 2022
He lost both of his legs and one hand after fighting for our nation against enemies
Salute to Deepchand ji for this courage #BharatJodoYatra pic.twitter.com/116wyW584i
Share this content: