Loading Now
Karnataka, Assembly Election, BJP, Congress, JD(S), Election Commission of India, కర్ణాటక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు,బీజేపీ, కాంగ్రెస్,జేడీ(ఎస్), భారత ఎన్నికల సంఘం, Karnataka Assembly elections 2023,

క‌ర్నాట‌కలో ఎన్నిక‌ల న‌గారా.. షెడ్యూల్ ప్ర‌క‌టించ‌నున్న ఈసీ

ద‌ర్వాజ‌-బెంగ‌ళూరు

Karnataka Assembly elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు-2023 కు సంబంధించి షెడ్యూల్ ను ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) నేడు (మార్చి 29 బుధ‌వారం నాడు) ప్రకటించనుంది. ఉదయం 11.30 గంటలకు ఎన్నికల సంఘం తేదీని ప్రకటిస్తుంది. కాగా, కర్ణాటక అసెంబ్లీలోని మొత్తం 224 స్థానాలోలో ప్రస్తుతం బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్ కు 75 మంది, దాని మిత్రపక్షం జేడీఎస్ కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ గడువు మే 24తో ముగియనుంది.

ఇప్ప‌టికే రాష్ట్రంలో ప్ర‌ధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ లు ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ లు ఇప్ప‌టికే మొద‌టి జాబితాతో ప‌లువురు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాయి. బీజేపీకి చెక్ పెట్టాల‌ని ఈ రెండు పార్టీలు దూకుడుగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నాయి.

Share this content:

You May Have Missed