• పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతు
• పరిస్థితి దారుణంగానే ఉందన్న సీఎం పినరయి విజయన్
దర్వాజ-తిరువనంతపురం
Kerala Rain Alert: కేరళను వరదలు పొటెత్తాయి. శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 20 మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఏడు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. భారీ వర్షం కారణంగా కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కొండచరియాలు విరిగిపడ్డాయి. ఆదివారం కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా కేరళ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలో ప్రభుత్వం అత్యవసరంగా సమావేశమైంది. తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. విజయన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితి దారుణంగానే ఉందని అన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని సహాయ శిబిరాలకు తరలిస్తున్నామని అన్నారు. రాష్ట్ర విపత్తు బృందాలతో పాటు జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు సైతం సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. సీపతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్, పాలక్కాడ్ జిల్లాలలో రెడ్ అలర్ట్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ పరిస్థితిని నిర్వహించడంలో సహాయపడటానికి రంగంలోకి దిగాయి. Mi-17, సారంగ్ హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. సదరన్ ఎయిర్ కమాండ్ కింద ఉన్న అన్ని స్థావరాలు అప్రమత్తంగా ఉన్నాయి. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ప్రముఖ శబరిమల ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో విద్యా సంస్థలకు సైతం సేలవులు ప్రకటించింది. బుధవారం విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి.
అంబరాన్నంటిన ‘బతుకమ్మ’ సంబురాలు
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 400 స్థానాలు గెలుస్తాం..
బాల్య వివాహాలు.. ఏటా 22 వేల మంది బాలికలు బలి
2-18 వయస్సుల వారికి కరోనా వ్యాక్సిన్
ఢిల్లీలో పాక్ ఉగ్రవాది అరెస్ట్
క్లిష్ట పరిస్థితుల్లో.. విద్యుత్ సంక్షోభం.. : కేజ్రీవాల్