Loading Now
Madhya Pradesh, Minor, Dalit, rape victim, police station, మ‌ధ్య‌ప్ర‌దేశ్, ద‌ళిత బాలిక‌, అత్యాచారం, పోలీసులు,

ఫోక్ సింగ‌ర్ పై లైంగికదాడి.. ఆపై దాడిచేసి న‌గ‌లు, డ‌బ్బులు దోచుకెళ్లిన దుండ‌గుడు !

దర్వాజ-న్యూఢిల్లీ

Woman folk singer raped: ఒక మ‌హిళా జాన‌ప‌ద గాయ‌కురాలిపై ఓ రిక్షాపుల్ల‌ర్ అత్యాచారానికి పాల్ప‌డిన ఘ‌ట‌న బెంగాల్ లోని కోల్‌కతా లో చోటుచేసుకుంది. పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. కోల్‌కతా స్టేషన్ ప్రాంతంలో మహిళా జానపద గాయనిపై వ్యాన్ రిక్షా పుల్లర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉల్తదంగా పోలీస్ స్టేషన్‌లో బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు న‌మోదుచేసుకునీ, ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

బాధితురాలి ఫిర్యాదు ప్ర‌కారం.. ఈ దారుణం జూలై 12 మధ్యాహ్నం చోటుచేసుకుంది. బాధితురాలు ద‌క్షిణ్‌దారి ప్రాంతంలో నివాస‌ముంటున్నారు. అయితే, కొన్ని గృహోపకరణాలను కొనుగోలు చేయడానికి ఆ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు వ‌ర్షం ప‌డ‌టంతో ఒక షెడ్డు కింద నిలుచున్నారు. ఈ క్ర‌మంలోనే నిందితులు వెనుక నుంచి వచ్చి సమీపంలోని ముళ్లకంచె వద్దకు ఈడ్చుకెళ్లి లైంగిక‌దాడి చేశాడు. అనంత‌రం ఆమెపై దాడి చేసి.. డ‌బ్బు, న‌గ‌లు దొచుకెళ్లాడు.

బాధితురాలు రెండు రోజులుగా అనారోగ్యంతో ఉంద‌నీ, శుక్రవారం తన బంధువుతో కలిసి ఉల్తాదంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వైద్య పరీక్షల్లో లైంగిక‌దాడి జ‌రిగినట్లు నిర్ధారించారు. నిందితులపై దొంగతనం కేసుతో పాటు అత్యాచారం కేసును న‌మోదుచేశామని తెలిపారు.

Share this content:

You May Have Missed