దర్వాజ-న్యూఢిల్లీ
Minister of State Ajay Mishra : ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో రైతుల మీదకు కారు దూసుకువెళ్లిన ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నిరసన తెలుపుతున్న రైతుల మీదకు దూసుకువెళ్లిన ఆ కారు తమదే అని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తాజాగా తెలిపారు. రైతులపైకి వెళ్లిన మహేంద్ర థార్ కారు తమదే అని మొదటి రోజు నుంచి చెబుతున్నాననీ, అది మా పేరు మీదే రిజిస్టర్ అయి ఉందన్నారు. తమ పార్టీ కార్యకర్తలను తీసుకురావడానికి వెళ్తొందన్నారు. రైతులను కారు ఢీ కొట్టిన సమయంలో కారులో తన కుమారుడు అశిష్ మిశ్ర లేడంటూ చెప్పుకొచ్చారు.
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా యూపీలో లకింపూర్ ఖేరీలో నిరసన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర వివాదాస్పద వ్యాఖ్యలు సైతం చేశారు. లకింపూర్‌లో రెండు కార్లను కాల్చివేశారనీ, వారు రైతులు కాదనీ, రైతుల ముసుగులో ఉన్న తీవ్రవాదులంటూ పేర్కొన్నారు.
బొగ్గు సంక్షోభంతో కరెంట్ కష్టాలు..
నిలిచిపోయిన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్..
అఫ్ఘాన్‌లో బాంబు దాడి.. 14 మంది మృతి
రైతులపైకి దూసుకెళ్లిన కేంద్రమంత్రి కాన్వాయ్.. 8 మంది మృతి
లింగ వివక్ష.. పితృస్వామ్యం.. మధ్యలో మహిళ !
పెరిగిన పెట్రోల్ ధరలు.. సెంచరీ కొట్టిన డీజిల్
లాల్ బహదూర్ శాస్త్రి మరణం వెనుక కారణాలు..
యూపీలో మరో దారుణం.. బాలికపై లైంగిక దాడి.. హత్య !