దర్వాజ-అమరావతి
laptop blast: కోవిడ్-19 ఇన్ఫెక్షన్ తగ్గినప్పటికీ.. చాలా టెక్ కంపెనీలు ఇప్పటికీ తమ ఉద్యోగులను కార్యాలయానికి పిలవకుండానే వర్క్ ఫ్రమ్ హోం ను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఛార్జింగ్ పెట్టి వర్క్ చేసుకుంటున్న ల్యాప్ టాప్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో యువతికి తీవ్రగాయాలయ్యాయి.ప్రస్తుతం ఆమె ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకెళ్తే.. బి.కోడూరు మండలం మేకవారి గ్రామానికి చెందిన సుమలతకు సోమవారం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటోంది. ఆ సమయంలో ఆమె ల్యాప్‌టాప్ ను చార్జింగ్ పెట్టి ఉంచింది. షార్ట్-సర్క్యూట్ కారణంగా.. వర్క్ ఫ్రమ్ హోం లో ఉండగా.. ఆమె లాప్‌ట్యాప్ ఒక్కసారిగా పెలిపోయింది.
ల్యాప్‌టాప్ పేలిపోవడంతో పేలుడు ధాటికి ఆమె కూర్చున్న బెడ్‌కు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో గాయపడిన బాధిత యువతిని స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు ఆప్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, బాధిత యువతి బెంగళూరుకు చెందిన మ్యాజిక్‌టెక్ సొల్యూషన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. మొదట ఆమె గదిలో నుండి మంటలు మరియు పొగలు రావడాన్ని గమనించిన తరువాత, కుటుంబ సభ్యులు ఆమెకు సహాయం చేయడానికి వెళ్లారు. అప్పటికే ఆ యువతికి 70-80 శాతం కాలిన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Share this content: