Breaking
Tue. Nov 18th, 2025

వైన్సుల ముందు బారులు తీరిన మందుబాబులు !

crowd gathers at liquor shops at delhi
crowd gathers at liquor shops at delhi

దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. దీంతో రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. సెకండ్‌వేవ్‌ కరోనాతో పలు రాష్ట్రాలు కఠిన చర్యలకు దిగుతున్నాయి. ఈ త‌రుణంలో దేశ రాజ‌ధాని ఢిల్లీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో మరో వారంరోజుల పాటు లాక్ డౌన్ ఆంక్షలు పొడిగిస్తున్నట్టు కేజ్రీవాల్‌ సర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.
గత వారం రోజుల్లో దేశరాజధానిలో ‌కరోనా కేసులు రెట్టింపు అవుతుండటంతో ఢిల్లీ వాసుల్లో ఆందోళ‌న పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే కేజ్రీవాల్ సర్కారు కర్ఫ్యూకే మొగ్గు చూపింది. ఢిల్లీలో విధించిన వారాంతపు లాక్‌డౌన్ ను మ‌రో వారం రోజులు పొడిగిస్తున్న‌ట్టు పేర్కొంటూ.. సోమవారం రాత్రి నుంచి వచ్చే సోమవారం ఉదయం దాకా పూర్తిస్థాయి కర్వ్యూను అమ‌లు చేయ‌నున్నట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

క్రమంలోనే పలు విచార‌క‌ర సంఘ‌ట‌న‌లు తార‌స‌ప‌డ్డాయి. ఓ వైపు.. క‌రోనాతో ప‌రిస్థితి చేదాటిపోయింద‌నీ ప్ర‌జ‌లు ఆందోళ‌న ప‌డుతుంటే.. మందుబాబులు మాత్రం త‌మ‌కేమీ క‌రోనా సోక‌ద‌న‌ట్టుగా.. వైన్స్ షాపుల ముందు బారులు తీరారు. లాక్‌డౌన్ నేపథ్యంలో మందుబాబులు కోవిడ్-19 రూల్స్ సైతం బ్రేక్ చేసి మద్యం కొనుగోలుకు చేయడానికి మద్యం దుకాణాల ముందు బారులుతీరారు.

Related Post