దర్వాజ-హైదరాబాద్
Hyderabad: తెలంగాణలో కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం ఏరులై పారింది. ఏకంగా రూ.700 కోట్ల మద్యం తాగేశాడు. దీంతో మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ (టీఎస్బీసీ)లో నూతన సంవత్సరంలో మద్యం అమ్మకాలు పెరిగాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 28న 2.72 లక్షల కేసుల బీర్లు, వైన్, హార్డ్ లిక్కర్, 29న 3.58 లక్షల కేసులు, డిసెంబర్ 30న 5.8 లక్షల కేసుల బీర్లు, మద్యం అమ్మకాలు జరిగాయి.
2023, డిసెంబరు 31వ తేదీ ఆదివారం మధ్యాహ్నానికి టీఎస్బీసీ డిపోలు రెండు లక్షల కేసుల మద్యం దుకాణాలకు పంపిణీ చేయగా, వాటి విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుందని అంచనా. నూతన సంవత్సరానికి ముందు నాలుగు రోజుల్లో మద్యం దుకాణాల్లో 5.5 లక్షల కేసుల వివిధ మద్యం, 7 లక్షల కేసుల బీర్లు విక్రయించగా, సుమారు రూ.758 కోట్ల అమ్మకాలు జరిగాయి.