దర్వాజ-హైదరాబాద్
Thieves return sarees after theft video goes viral: ఒక దొంగల ముఠా రెండు బృందంగా ఏర్పడిన ఒక వస్త్రాల షాపులోకి ప్రవేశించి ఎక్కువ చీరలు చూపించాలని కోరారు. ఈ క్రమంలోనే షాపు సిబ్బంది దృష్టిని మరల్చి రూ.2 లక్షల విలువ చేసే ఐదు చీరలతో పరారయ్యారు. అయితే, చీరలు వేయాలని ఆడిగి, దాదాపు 20 నిమిషాలు ఉన్న తర్వాత ఏమీ తీసుకోకుండా వారు వెళ్లిపోవడంతో షాపు వారికి అనుమానం వచ్చింది. సరుకు వివరాలు చూసుకోగా కొన్ని ఖరీదైన చీరలు మిస్సయినట్టు గుర్తించారు. అక్కడి సీసీటీవీని పరిశీలించగా దొంగతనం జరిగిన విషయం బయటపడింది.
హైదరాబాద్ లోని మణికొండలో ఈ ఘటన చోటుచేసుకుంది. తేజా సారీస్ బొటిక్ లో సోమవారం జరిగిన ఈ దొంగతనం గురించి దాని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే, సంబంధిత వీడియో దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇది వైరల్ కావడంతో దొంగలు వీడియోను తొలగించాలనీ, చీరలను తిరిగి ఇచ్చేస్తామని ఆయన కాల్ చేశారు. కొద్ది సమయం తర్వాత పక్క షాపులోని సెక్యూరిటీ గార్డుకు దొంగిలించిన చీరలను ఇచ్చారు.