దర్వాజ-సిద్దిపేట
Finance Minister T Harish Rao: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేటలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఉదయం 1.792 కిలోల బంగారు కిరీటాన్ని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు బహూకరించారు.
కోటి రూపాయలకు పైగా విలువ చేసే ఈ కిరీటాన్ని ఆలయ యాజమాన్యం కొనుగోలు చేసిన కిలో బంగారంతో తయారు చేయగా, మిగిలిన మొత్తాన్ని హరీష్ రావుతో సహా దాతలు విరాళంగా ఇచ్చారు. ఈ క్రమంలోనే మంత్రి శ్రీ వేంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకునీ, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముక్కొటి వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రార్థనలు చేయడానికి ప్రసిద్ధ ఆలయానికి చేరుకోవడంతో ఈ ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది.
