Loading Now
Telugu News, ద‌ర్వాజ‌, darvaaja, Telugu News updates, తెలుగు న్యూస్‌, తాజా వార్త‌లు, Monkeypox, Telangana, health minister, people, health screening, international travellers, India, airports, ports,Harish Rao, మంకీపాక్స్, తెలంగాణ, ఆరోగ్య మంత్రి, ప్రజలు, ఆరోగ్య పరీక్షలు, అంతర్జాతీయ ప్రయాణికులు, భారతదేశం, విమానాశ్రయాలు, ఓడరేవులు, హరీష్ రావు,

Monkeypox: మంకీపాక్స్ వ్యాపిస్తోంది.. జాగ్రత్త..: మ‌ంత్రి హ‌రీశ్ రావు

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Telangana Health Minister Harish Rao: ప‌్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించిన‌ట్టుగానే ఆఫ్రికా దేశాల్లో క‌నిపించే మంకీపాక్స్ కేసులు ఇప్పుడు అన్ని దేశాల‌కు వ్యాప్తి చెందుతున్నాయి. భార‌త్ లోనూ మంకీ పాక్స్ కేసులు గుర్తించారు. కేర‌ళ‌లో రెండు కేసులు గుర్తించిన త‌ర్వాత కేంద్రంతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే ప‌క్క‌రాష్ట్రమైన కేరళలో రెండు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్క మంకీపాక్స్ కేసు కూడా నమోదు కాలేదని పేర్కొన్న ఆయ‌న.. జాగ్ర‌త్తలు తీసుకోవ‌డంతో పాటు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అన్నారు.

సోమవారం నాడు మంత్రి టీ హరీశ్‌రావు.. ఐఐఎఫ్‌హెచ్‌, వెంగళ్‌రావునగర్‌ నుంచి డీఎంఈ, టీవీవీపీ వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దేశంలో మంకీపాక్స్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా, వ్యాధి లక్షణాలు, పరీక్షలు, గుర్తింపు, చికిత్సపై అవగాహన కల్పించేందుకు ఈ సమావేశం జరిగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మంకీపాక్స్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూనే.. అంద‌రూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 60కి పైగా దేశాల్లో దాదాపు 1,20,000 కేసులు నమోదైనప్పటికీ కేరళలో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయ‌ని తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు.

మంకీపాక్స్ వ్యాధిపై వైద్య, ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ దేశాల్లో నమోదవుతున్న వ్యాధిపై అధ్యయనం చేస్తున్నామని, డబ్ల్యూహెచ్‌వో, ఐసీఎంఆర్ మార్గదర్శకాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు. గాంధీ ఆసుపత్రిలో రోగ నిర్ధారణ కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేశామ‌న్నారు. అలాగే, అనుమానిత కేసుల తక్షణ చికిత్స కోసం ఫీవర్ ఆసుపత్రిని నోడల్ ఆసుపత్రిగా నియమించారు. మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు, పరీక్షలు, చికిత్సపై వైద్యులందరూ అవగాహన పెంచుకోవాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి దీని గురించి వివరించాలని మంత్రి హ‌రీశ్ రావు సూచించారు.

Share this content:

You May Have Missed