దర్వాజ-మాస్కో
Moscow: రష్యాలోని సఖాలిన్ ద్వీపంలోని నివాస భవనంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారని అంతర్జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. వివరాల్లోకెళ్తే.. రష్యాలోని సఖాలిన్ ద్వీపంలోని ఓ అపార్ట్మెంట్ భవనంలో శనివారం గ్యాస్ సిలిండర్ పేలడంతో తొమ్మిది మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
మీడియా నివేదికల ప్రకారం, ఐదు అంతస్తుల నివాస భవనంలో జరిగిన పేలుడులో మరణించిన వారిలో నలుగురు పిల్లలు ఉన్నారు. మాస్కో కాలమానం ప్రకారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. అపార్ట్మెంట్ భవనం శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ టీమ్లు ప్రయత్నిస్తున్నాయని అధికారులు తెలిపారు.
Власти Сахалинской области приобретут жилье всем пострадавшим от взрыва газа в жилой пятиэтажке в поселке Тымовское. Об этом глава региона Валерий Лимаренко сообщил в эфире телеканала "Россия-24":https://t.co/gDkKd0ToXs pic.twitter.com/2EsCZ60bhU
— ТАСС (@tass_agency) November 19, 2022
