దర్వాజ-వైరల్ వీడియో
Mother Love: శానాల్లు అయిన వాళ్లు దూరంగా విదేశాల్లో ఉంటే ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. కానీ వాళ్లు మన దగ్గరకు వస్తురన్న వార్త వచ్చిందంటే చాలు.. ఎయిర్ పోర్టుకు పూల బొకేలు, ప్లకార్డులతో ఘనంగా స్వాగతం పలుకుతారు. మరికొంతమందైతే సర్ ప్రైజ్ గిఫ్ట్ లతో వెల్కమ్ చెప్తుంటారు. ఇక ఆ ప్రయాణికులు ఎమోషనల్ అయిపోయి హత్తుకుంటారు. ఇలాంటి వార్తలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం.
కానీ ఓ తల్లి మాత్రం తనను రిసీవ్ చేసుకోవడానికి ఘనంగా వెల్కమ్ చెప్పిన కొడుకు పట్ల వెరైటీగా స్పందించి వార్తల్లో నిలిచింది. ఇంతకి ఏం జరిగిందంటే.. అన్వర్ జిలాని అనే వ్యక్తి తల్లి వేరే దేశంలో ఉండేది. తాజాగా ఆమె తన కొడుకు దగ్గరకు వచ్చింది. ఆమె రాక కోసం పూల బొకేలు, ఐ మిస్ యూ అమ్మా అని రాసున్న ప్లకార్డుతో తల్లికి వెల్కమ్ చెప్పాడు. కానీ ఆ తల్లి మాత్రం నేరుగా కొడుకు దగ్గరకొచ్చి తన చెప్పును చేతిలోకి తీసుకుని కొడుకుని చితకబాదింది.
ఇంకేముంది కొడుకు నవ్వుకుంటూ బొకేను, ప్లకార్డును కింద పడేసి కొంత దూరం వెళ్తాడు. ఆ వెనువెంటనే ఆ తల్లి కొడుకుని హత్తుకుని ఎమోషనల్ అయ్యింది. ఈ ఇన్సుడెంట్ పాకిస్థాన్ ఎయిర్ పోర్టులో జరిగింది. ఈ వీడియోను అన్వర్ జిలాని తన ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. దాదాపుగా ఈ వీడియోను 145 మిలియన్ కంటే ఎక్కువే చూశారు. దీనిపై జనాలు ఆ తల్లి ఎంతగా తన కొడుకుని మిస్ అయ్యిందో వీడియోను చూస్తేనే అర్థమవుతోందని కామెంట్లు చేస్తున్నారు.
స్టైలిష్ వేర్ లో నోరెళ్ల బెట్టిస్తున్న సమంత.. మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే..
మీకిది తెలుసా.. నేటి నుంచే వీటి ధరల మరింత ఖరీదు కానున్నాయి..
గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?