ముంబ‌యి ఎయిర్ పోర్టుకు బెదిరింపు కాల్.. ఒక‌రు అరెస్ట్

Mumbai, Police, Threatening Call, Arrest, Maharashtra, Airport,

ద‌ర్వాజ‌-ముంబ‌యి

Mumbai Airport: ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యి లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సోమవారం రాత్రి బెదిరింపు కాల్ రావడంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ క్రమంలోనే ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు గోవండి ప్రాంతం నుండి కాల్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. కాల్ చేసిన వ్యక్తి తనను తాను ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఇర్ఫాన్ అహ్మద్ షేక్ అని పరిచయం చేసుకున్నాడ‌నీ, విమానాశ్రయాన్ని పేల్చివేస్తానని బెదిరించాడ‌ని పోలీసులు తెలిపారు.

నిందితుడు (25) సోషల్ మీడియా లేదా వెబ్ సిరీస్‌ల ద్వారా ప్రేరణ పొంది బెదిరింపు కాల్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతని ద్వారా ఎవరికైనా కాల్ వచ్చిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నిత్యం వాంగ్మూలాలు మారుస్తుండడంతో మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు.

అంత‌కుముందు, బెదిరింపు కాల్ రావడంతో విమానాశ్రయంలోని అన్ని ఏజెన్సీలను అప్రమత్తం చేశారు “సోమవారం బెదిరింపు కాల్ రావడంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముంబయి పోలీసులు, ఇతర ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. కాలర్ తనను ఇర్ఫాన్ అహ్మద్ షేక్ అననీ, ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ సభ్యుడిగా పరిచయం చేసుకున్నాడు” అని పోలీసుల ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Related Post