Breaking
Tue. Nov 18th, 2025

Munugodu by-election: ఓట్ల లెక్కింపులో ఆల‌స్యం.. బీజేపీ-టీఆర్ఎస్ వ్యాఖ్యలపై చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎమ‌న్నారంటే..?

మునుగోడు ఉప ఎన్నిక‌, టీఆర్ఎస్, బీజేపీ, ఎన్నిక‌ల సంఘం, వికాస్ రాజ్, తెలంగాణ‌, హైద‌రాబాద్, Munugodu by-election, TRS, BJP, Election Commission, Vikas Raj, Telangana, Hyderabad,

దర్వాజ-మునుగోడు

Munugodu by-election results: తెలంగాణ‌లో రాష్ట్ర రాజ‌కీయాల్లో మునుగోడు ఉప ఎన్నిక ఫ‌లితంపై ఉత్కంఠ నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే ఓట్ల లెక్కింపులో ఆల‌స్యం.. బీజేపీ-టీఆర్ఎస్ వ్యాఖ్యలపై తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికార‌స్ రాజ్ స్పందించారు. మునుగోడు ఉప ఎన్నికలో స్లో కౌంటింగ్‌పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ), తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఫిర్యాదులపై స్పందిస్తూ పారదర్శకంగా ఓట్ల లెక్కింపు చేపట్టామని ఎన్నికల ప్రధాన అధికారి వికాసరాజ్ తెలిపారు.

ఆదివారం తెల్లవారుజామున తెలంగాణ ఇంధన శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల అధికారులు రౌండ్ల వారీగా ఫలితాలను మీడియాకు ప్రకటించాలని కోరారు. ఎన్నికల అధికారులు మీడియాకు వివరాలను లీక్ చేస్తున్నారనే సమస్యను పరిష్కరించాలని కూడా ఆయ‌న భారత ఎన్నికల సంఘాన్ని కోరారు. కౌంటింగ్ ప్రక్రియలో జాప్యంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కౌంటింగ్‌ కేంద్రంలోని అధికారుల నుంచి మీడియాకు లీక్‌లు వస్తున్నాయని ఆరోపించారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కౌంటింగ్ ప్రక్రియపై నిరాసక్తత వ్యక్తం చేస్తూ, “మొదటి, రెండవ రౌండ్‌లతో పోల్చినప్పుడు మూడు-నాల్గవ రౌండ్‌ల డేటాను అప్‌డేట్ చేయడంలో జరిగిన జాప్యాన్ని తెలంగాణ సీఈవో వివరించాలి. మీడియా నుంచి ఒత్తిడి వస్తే తప్ప డేటా ఎందుకు అప్‌లోడ్ చేయడం లేదు? అని ప్ర‌శ్నించారు.

Related Post