Breaking
Tue. Nov 18th, 2025

Munugodu by-election: మునుగోడు ఉప ఎన్నిక‌.. 9వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ లీడ్

మునుగోడు ఉప ఎన్నిక‌, టీఆర్ఎస్, బీజేపీ, ఎన్నిక‌ల సంఘం, వికాస్ రాజ్, తెలంగాణ‌, హైద‌రాబాద్, Munugodu by-election, TRS, BJP, Election Commission, Vikas Raj, Telangana, Hyderabad,

దర్వాజ-మునుగోడు

Munugodu by-election results: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఉప ఎన్నికలో తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని ఆదివారం ఉదయం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నల్గొండ కౌంటింగ్ హాలు వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇక 9వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ లీడ్ లో ఉంది. మునుగోడు ఉప ఎన్నిక ఫ‌లితంపై ఉత్కంఠ నెల‌కొంది. ప్ర‌స్తుతం ఓట్ల లెక్కింపు కొన‌సాగ‌తోంది. అయితే, 9వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ లీడ్ లో కొన‌సాగుతోంది. 9 రౌండ్లు ముగిసే స‌రికి టీఆర్ఎస్ దాదాపు 4 వేల ఓట్ల‌కు పైగా లీడ్ లో ఉంది.

చండూరు మండలంలో 9వ రౌండ్‌, గట్టుప్పల్‌లో 10, 11, నాంపల్లి మండలంలో 13, 14, 15 రౌండ్‌లలో కౌంటింగ్‌ కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముందజలో ఉండగా, రాజగోపాల్ రెడ్డి రెండో స్థానంలో, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మూడో స్థానంలో ఉన్నారు.

ప్రభాకర్ రెడ్డి (టీఆర్ఎస్) – 52,343 ఓట్లు

రాజగోపాల్ రెడ్డి (బీజేపీ) – 49,243 ఓట్లు

పాల్వాయి స్రవంతి (కాంగ్రెస్) – 14,596 ఓట్లు

Related Post