నంగునూర్ మట్టికి దండం.. ఉద్యమంలోకి రావడానికి స్ఫూర్తినిచ్చింది ఈ ఊరే : దేశపతి శ్రీనివాస్

Desapati Srinivas

దర్వాజ-సిద్దిపేట

Desapati Srinivas: నంగునూర్ మండల కేంద్రంలో జరిగిన మొట్టమొదటి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో ప్రజాకవి, రచయిత దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. “నంగునూర్ మట్టికి దండం. ఎందుకంటే.. నాకు అన్నం పెట్టిన ఊరిది. నా ఉద్యోగ జీవితం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. 1998 ఆగస్టులో తెలుగు పండిట్ గా చేరాను. నాకు ఈ నంగునూర్ మండలం చాలా ప్రేమను పంచింది. కేవలం క్లాస్ రూమ్ లకే పరిమితమే కాకుండా ఈ ఊరి ప్రజలతో కూడా వీడదీయలేని సంబంధముంది” అని తన గత జ్ఞాప‌కాల‌ను గుర్తుకు చేసుకున్నారు.

అలాగే, “తెలంగాణ రాకముందు.. రాష్ట్రం వచ్చిన తరువాత నంగునూర్ కు చాలా మార్పు వచ్చింది. ఊరు మారింది. రోడ్లు బాగయ్యాయి. పెంకుటిండ్లు పోయి.. బంగ్లాలు వచ్చాయి. ఈ 1998 లోనే తెలంగాణ ఉద్యమంతో అనుబంధం పెంచుకున్నా.. ఆనాటి నందిని సిద్దారెడ్డి రాసిన పాట యాదికి వస్తుందంటూ.. ఆనాటి ఉద్యమ రోజులను గుర్తు చేసుకున్నారు. ఇక్కడి జనాన్ని చూస్తే.. ఓ దిక్కు బతుకమ్మ పండుగలా.. మరో దిక్కు దసరా పండుగ సందడిలా కనిపిస్తుంది. ఓ వైపు పాలపిట్టను చూసినట్టు.. మరోవైపు.. బతుకమ్మలు చూసినట్టు ఉందంటూ..

తంగేటి పువ్వులు తాంబాలం అంత..
తీరొక్క రంగుల తీరిచిన పువ్వు..
తీరొక్క రంగుల్లా తీరిచిన పువ్వు..
బంగారు చీరలు బజార్లు అన్ని..
నాగేటి సాళ్లల్ల నా తెలంగాణ..
బతుకమ్మ పండుగ నా తెలంగాణ .. నా తెలంగాణ..

కొత్త బట్టలు కట్టి కోటి ముచ్చట్లు..
పాల పిట్టల చూసి పడుచు చప్పట్లు..
పాల పిట్టల చూసి పడుచు చప్పట్లు..
జొన్న కరాళ జెండా జోరు ఉన్నదేమి …
అలై బలై తీసే నా తెలంగాణ నా తెలంగాణ..
జమ్మి పంచిన ఆర్తి నా తెలంగాణ నా తెలంగాణ..
నాగేటి సలల్ల నా తెలంగాణ నా తెలంగాణ..
అంటూ గొంత్తెతి.. సభ ప్రాంగణాన్ని ఉర్రుతాలిగిచ్చారు.

అలాగే, “తెలంగాణ జీవన ముఖచిత్రం నంగునూర్ లోనే అర్థమైంది. ఇక్కడి రైతుల జీవితాలు.. సామాన్యుల కష్టాలు.. దు:ఖం.. పేద ప్రజల ఆకలి కేకలు తరగతిలోనే అర్థమయ్యాయి. కేవలం ఉద్యోగం చేయడమే కాదు.. ప్రజల్లోకి వెళ్లి వారిని చైతన్యం పరచాలని, నా జీవితం కేవలం బడులో పాఠాలు చెప్పడం కాదు.. ప్రజలను చైతన్య పరచాలని ఇక్కడే అర్థమైంది. మరోరకంగా చెప్పలంటే.. తాను తెలంగాణ ఉద్యమంలో చేరడానికి నంగునూరే కారణమైంది” అని దేశపతి అన్నారు.

చెరువులు గురించి మాట్లాడుతూ.. “గతంలో ఎప్పుడూ చూసినా.. ఎండకాలమోలే ఉండేది.. ఇప్పుడూ ఎప్పుడూ వానకాలమే. ఎండకాలంలో కూడా చెరువులు మత్తెడ దూకుతున్న సన్నివేశం తెలంగాణలోనే కనిపిస్తోంది. ఈ ఘతన తెలంగాణ ప్రభుత్వానిది.. ఈ ఘనత సీఎం కేసీఆర్ ది. గత పాలకులు చెరువులను పాటించుకోలేదు. తెలంగాణ వచ్చాక చెరువులకు పూర్వ వైభవం వచ్చింది. మిషన్ భగీథర, మిషన్ కాకతీయ, కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంతో నదులు, చెరువుల అనుసంధానం జరిగింది”. అని అన్నారు.

నాడు నీటికి భరోసా.. నేడు ఆరోగ్యానికి భరోసా…

మంత్రి హరీష్ రావు గురించి మాట్లాడుతూ.. “రాష్ట్రమోచ్చిన కొత్తలో హరీశ్ రావును చూస్తే.. ఓ నది కదిలి వస్తున్నట్టు.. వాగు పారినట్టు ఉంటుందే.. ఇప్పుడు హరీషాన్నను చూస్తే.. మంచిగా భుజం మీద సేయిపెట్టి ఆరోగ్యమేలా ఉందని అడిగినట్టు అనిపిస్తుంది. ఆయన మెడలో ఉన్న కండువాను చూస్తే.. డాక్టర్ మెడలో ఉంటే సెతస్కోప్ చూసినట్టు అనిపిస్తుంది. ఈ రోజు హరీషన్న వైద్యం.. నేడు వైద్యానికి భరోసా ఇస్తుండు .. ఆనాడు నీటికి భరోసా ఇచ్చిండు. ఆనాడు హరీష్ రావు ఓ మాట అన్నాడు.. నేను నేడు నీళ్ల శాఖ మంత్రిని అనుకోవడం లేదు.. ఈ రాష్ట్రంలో రైతన్నలకు నీళ్లలందించే పెద్ద నీరటి గాడి నేననుకుంటానన్నారు. ఒకప్పడు నీళ్ల కోసం మొగులు దిక్కు సూసేటోళ్లు.. నేడు హరీషన్న దిక్కు చూస్తున్నారు.” అని అన్నారు.

By Nikhila

Related Post