Breaking
Tue. Dec 3rd, 2024

WhatsApp Accounts Ban: 17.5 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఎందుకంటే..?

whatsapp
whatsapp

దర్వాజ-జాతీయం

WhatsApp Accounts Ban: ప్రస్తుత కాలంలో ఫోన్ లేకుండా ఎలా ఉండలేరో.. అలాగే వాట్సాప్ అకౌంట్ లేకుండా కూడా జనాలు ఉండలేకపోతున్నారు. అసలుకి వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదేమో. అరచేతిలో ప్రపంచాన్ని చూసే ఈ కాలంలో వాట్సాప్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పొద్దున లేచిన మొదలు నుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్ లో మునిగి తేలుతున్న వాళ్ల సంఖ్య భారీగానే ఉంది. అందులోనూ సమయం తెలియకుండా.. తిండి తిప్పలు లేకుండా చాటింగ్ లో మునిగిపోయేవాళ్లు లేకపోలేదు.

గ్రూప్ లు క్రియేట్ చెయ్యడం సమయం మరిచి చాటింగ్ లో మునిగిపోవడం నేడు సర్వ సాధారణం అయిపోయింది. దీంతో కుటుంబ సభ్యుల మధ్య మాటలు కరువయ్యాయనే చెప్పొచ్చు. ఇక ఈ సంగతి పక్కన పడితే.. వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2021 నవంబర్ లో ఏకంగా 17.5 లక్షల వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసినట్టు కంప్లియెన్స్ రిపోర్టులో ప్రకటించి ప్రజలను షాక్ కు గురిచేసింది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే.. కొంత కాలం నుంచి వాట్సాప్ సంస్థపై విపరీతంగా ఫిర్యాదులు వచ్చిపడుతున్నాయి.

అసభ్యరమైన పోస్టులు.. ఇతరత్రా అంశాలపై వాట్సాప్ కంపెనీపై యూజర్స్ ఫిర్యాదులు చేశారట. సుమారుగా 602 కంప్లైట్స్ రావడం జరిగిందని రిపోర్ట్ తెలుపుతోంది. అందుకే నిబంధనలు ఉల్లంఘించిన భారత్ ఖాతాలను బ్యాన్ చేసినట్టు వెళ్లడించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 40 కోట్లకు పైగా వాట్సాప్ యూజర్లు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త ఐటీ నిబంధనల ప్రకారం.. ఎవరైతే నిబంధనలు ఉల్లంఘిస్తారో వారి ఖాతాను రద్దు చేయడం జరుగుతుందని ఆ సంస్థ పేర్కొంది.

Kajal Aggarwal Pregnancy: కన్ఫర్మ్ చేసిన కిచ్లు.. కాజల్ తల్లి కాబోతుందంటూ ఆ ఒక్క బొమ్మతో చెప్పకనే చెప్పాడుగా..

Varshini Hot Show: అరే ఏంట్రా ఇది.. వర్షిణీ ఇలా కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది..?

India Corona Updates: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

Police Thieves: సెలబ్రేషన్స్ కోసం మేకలను దొంగలించిన పోలీస్.. మరీ ఇంత కక్కుర్తి ఏందయ్యా సామీ..?

Liquor Sales: మందు బాబులా మజాకా.. ఒక్క 5 రోజుల్లోనే ఇన్ని కోట్లు తాగేసారా..!

Deepthi Shanmukh Breakup: ఐపోయింది అంతా అయిపోయింది.. అనుకున్నట్టే దీప్తి సునైనా షణ్ముఖ్ కు బ్రేకప్ చెప్పేసిందిగా..

Pushpa Deleted Scene: పుష్ప సీన్ అదిరిపోలా.. మరెండుకు తీసేస్నారబ్బా..!

TS News : ‘తెలంగాణలో నేరాలు పెరిగినయ్’

Share this content:

Related Post