- ఐదు రాష్ట్రాలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
- తొలి దశ పోలింగ్ మార్చి 27.. మే 2న ఓట్ల లెక్కింపు
- ఎన్నికలకు ముందే అధికారులకు కరోనా టీకాలు
- పోలింగ్ సమయం ఒక గంట పెంపు
అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలో ఎన్నికల నగారా మోగింది. ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. పలు దశల్లో జరగనున్న ఎన్నికల పోలింగ్ మార్చి 27న ప్రారంభమై ఏప్రిల్ 29న ముగుస్తుంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి మే 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ తెలిపింది.
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలకు, తమిళనాడులో 234 స్థానాలకు, కేరళలో 140 స్థానాలకు, అసోంలో 126 స్థానాలకు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కరోనా మహమ్మారి మధ్యే గతేడాది (2020) నవంబర్ లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈ రాష్ట్రాలకు కూడా కరోనావైరస్ మహమ్మారి మధ్య ఎన్నికలు జరగనున్నాయి. ఓటింగ్ సమయంలో ఇదివరకు అనుసరించిన నియమావళిని అమలు చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.
కాగా, పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది దశల్లో పోలింగ్ జరగనుంది. మొదటి ఎన్నికలు మార్చి27న, రెండో దశ ఏప్రిల్ 1న, మూడో దశ ఏప్రిల్ 6న, నాల్తో దశ ఏప్రిల్ 10న, ైదో దశ ఏప్రిల్ 17న, ఆరో దశ ఏప్రిల్ 22న, ఏడో దశ ఏప్రిల్ 26న, ఏప్రిల్ 29న ఏమిదో దశ పోలింగ్ జరుగనుంది. అసోంలో మూడు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. తొలదశ పోలింగ్ మార్చి 27, రెండో దశ ఏప్రిల్ 1న, మూడో దశ పోలింగ్ ఏప్రిల్ 6న జరుగుతోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతగా ఏప్రిల్ 6న జరగనున్నాయి.

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ ఐదు రాష్ట్రాల్లో మొత్తం 2.7లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (సీఈసీ) సునీల్ అరోరా వెల్లడించారు. మొత్తం ఈ రాష్ట్రాల్లో 824 అసెంబ్లీ స్థానాలున్నాయన్నారు. మొత్తం 18.68 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు వేసేందుకు అర్హులుగా ఉన్నారని తెలిపారు. ఎన్నికల ముందే ఎన్నికల అధికారులు కోవిడ్ టీకాలు వేస్తామని తెలిపారు. బెంగాల్ లో ఇద్దరు ప్రత్యేక పరిశీలకులను నియమించనున్నట్టు అరోరా తెలిపారు. పుదుచ్చేరి కాకుండా మిగిలిన నాలుు రాష్ట్రాల్లో ఒక్కో అభ్యర్థి ఎన్నికల ఖర్చును రూ.30.8 లక్షలుగా నిర్ణయంచింది.
అందానికి.. ఆరోగ్యానికి గోరింటాకు !
టీవీ, మొబైల్స్.. డెంజర్‌లో టీనేజర్స్ !