Loading Now
Kanshi Ram, Bahujan Nayak, Manyavar, Indian politician, social reformer, Bahujans,Dalit Shoshit Samaj Sangharsh Samiti, Bahujan Samaj Party, BSP, Uttar Pradesh, కాన్షీ రామ్, బహుజన్ నాయక్, బహుజన్ సమాజ్ పార్టీ,బీఎస్పీ, ఉత్తరప్రదేశ్,

కులాన్ని నిర్మూలిద్దాం – బహుజన సమాజాన్ని నిర్మిద్దాం : కాన్షీరామ్ జీవిత విశేషాలు..

దర్వాజ-సిద్దిపేట

Bahujan Nayak Kanshi Ram: కాన్షిరాం ఒక భారత రాజకీయ నాయకుడు, సామాజిక సంస్కర్త, బహుజనుల అభ్యున్నతి కోసం-రాజకీయ సమీకరణ కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు మాన్యశ్రీ కాన్షీరామ్, బహుజన రాజకీయ వ్యూహకర్త, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని తన రాజకీయ పని విధానంతో ఆచరణలోకి తీసుకు వచ్చి బహుజన రాజ్యాధికారానికి బాటలు వేసిన మహనీయుడు మాన్యశ్రీ కాన్షీరామ్. వేలాది సంవత్సరాలుగా ఈ దేశ బహుజనులను అణిచి వేస్తున్న కులాన్నే ఎదిరించి దానికి వ్యతిరేకంగా మరలా కులాన్నే ఉపయోగించి బలహీనవర్గాల బహుజన కులాలను బలమైన శక్తిగా సామాజిక పరివర్తన చెందిన మహానేత కాన్షీరాం, కాన్షీరాం ఒక సంచలనాత్మక రాజకీయ ఉద్యమ నాయకుడు కాన్షిరాం,ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనగారిన ప్రజలకు కులాలకు రాజనీతిని బోధించిన తత్వవేత్త, బహుజనులను తన ప్రసంగాల ద్వారా చైతన్య పరిచిన మహాపురుషుడు.

” కులాన్ని నిర్మూలిద్దాం – బహుజన సమాజాన్ని నిర్మిద్దాం ” అని దేశం నలుమూలలా ప్రచారం చేసిన రాజకీయ బుద్ధుడు మాన్యశ్రీ కాన్షీరామ్.

అంబేద్కర్ రాజకీయ సిద్ధాంతం ప్రకటనలను కాన్షీరాం నిశితంగా అధ్యయనం చేశాడు. తనదైన శైలిలో రాజకీయ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని అనుకున్నాడు. అయితే రాజకీయయేతర మూలలను బలోపేతం చేసిన తరువాతే రాజకీయ ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే 1971 సంవత్సరం నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఉద్యోగులను సంఘటితం చేయడం మొదలుపెట్టాడు. పంజాబ్ రాష్ట్రం రోపర్ జిల్లాలో ఖ్యాసపూర్ గ్రామంలో బిషన్ సింగ్ కౌర్, హరిసింగ్ దంపతులకు కాన్షీరామ్ జన్మించాడు, కాన్షిరాం పూర్వీకులు మిలిటరీ ఉద్యోగులు. అందువల్ల చిన్నతనం నుండే ఆయన ఆత్మగౌరవం మరియు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకున్నాడు. కాన్షీరామ్ స్వతహాగా హేతువాది-మానవతావాది.


డిగ్రీ పూర్తి చేసి 1958వ సంవత్సరంలో మహారాష్ట్రలోని పూణే సమీపంలో కీర్కిలో కేంద్ర రక్షణ శాఖకు చెందిన ఎక్స్ ప్లోజీవ్ రిసర్చ్ డిఫెన్స్ లేబరేటరీలో కెమిస్టగా చేరాడు. 1963వ సంవత్సరంలో సహచర ఉద్యోగి డాక్టర్ అంబేద్కర్ జయంతి, వాల్మీకి జయంతి సెలవుల గురించి పై అధికారులను ప్రశ్నించి సస్పెన్షన్ కు గురయ్యారు. దాంతో సహచర ఉద్యోగి సస్పెన్షన్ రద్దు కోసం కాన్షీరామ్ చాలా అద్భుతంగా ఉద్యమించాడు. తన తోటి ఉద్యోగులను సమీకరించి సహచర ఉద్యోగిని మరల ఉద్యోగంలో చేర్చుకునేందుకు అంబేద్కర్ వాల్మీకి జయంతులను సెలవులుగా ప్రకటించడంతో విజయం సాధించారు. డాక్టర్ డాక్టర్ అంబేద్కర్ రాజకీయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI) లో ఎనిమిది సంవత్సరాలు పని చేశాడు. 1956లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహాపరినిర్వాణం తరువాత ఆయన రాజకీయ ఉద్యమం మహారాష్ట్ర లోనూ ఉత్తరప్రదేశ్ లను వెనుకబడింది. 1956 నుండి 1971 వరకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా క్రమ క్రమంగా క్షీణించింది. మహారాష్ట్రలోని ఆర్బీఐ నాయకుడు దాదాసాహెబ్ గైక్వాడ్, ఉత్తరప్రదేశ్లో ఆర్బీఐ నాయకుడు బీపీ మౌర్య వేరే పార్టీలోకి వెళ్లిపోయారు.

మహారాష్ట్రలో అంబేద్కర్ రాజకీయ ఉద్యమం అంతరించిపోయింది. అంబేత్కారిస్టులు తమనుతాము పిలుచుకునేవారు వేరే పార్టీల లో ఆశ్రయం పొంది చెంచాలు గా దళారులుగా మారిపోయారు. ఈ పరిణామం కాన్షీరామ్ అన్న చాలా కలచివేసింది. 1971 సంవత్సరంలో ఆయన ఉద్యోగాన్ని వదిలివేశాడు. పెళ్లి కుటుంబం గురించి ఆలోచించకుండా అంబేద్కర్ రాజకీయ సిద్ధాంతం స్పూర్తితో బహుజన సమాజాన్ని నిర్మించాలని లక్ష్యంతో ముందుకు సాగాడు. అనగారిన కులాలు రాజకీయ అధికారం సాధిస్తేనే వారి సమస్యలు పరిష్కారమవుతాయని కాన్షీరాం దృఢంగా నమ్మేవారు. అంబేద్కర్ రాజకీయ సిద్ధాంతం ప్రకటనలను కాన్షీరామ్ నిశితంగా అధ్యయనం చేసేవాడు. తనదైన శైలిలో రాజకీయ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని కాన్షిరాం వ్యూహాలు రచించేవాడు. అయితే రాజకీయేతర మూలాలను బలోపేతం చేసిన తర్వాతే రాజకీయ ఉద్యమంన్ని ముందుకు తీసుకుపోవాలి నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగానే 1971 సంవత్సరం నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగులను సంఘటితం చేయడం మొదలుపెట్టాడు. 1973 సంవత్సరంలో ఉద్యోగ సంఘాల సమాఖ్య ఏర్పాటు చేశాడు. చివరకు 5 సంవత్సరాల కఠోర శ్రమ అధ్యయనం పరిశీలన తర్వాత 1978 సంవత్సరంలో డిసెంబర్ 6న “బాంసెఫ్ “అనే పేరుతో ఉద్యోగుల సంఘం ప్రారంభించాడు . ఏ సమాజం నుంచి పుట్టాము ఆ సమాజం పట్ల తన రుణాన్ని ఉద్యోగులు తీర్చుకోవాలని బోధిస్తూ ” పే బ్యాక్ టు ద సొసైటీ” అనే నినాదంతో బాంసెఫ్ ను కాన్సిరాం నిర్మించాడు.

బహుజన సమాజానికి ఉద్యోగులు తమ ఆలోచనలను, ప్రతిభను ధనాన్ని, సమయాన్ని కేటాయించాలని రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులను చైతన్యపరిచాడు. ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పంజాబ్ హర్యానా లో బాంసెఫ్ ను తొలుత ప్రారంభించి అనంతరం ఉత్తరాది రాష్ట్రాల అన్నింటికీ 1979వ సంవత్సరంలో “అంబేద్కరిజం పునర్ జీవిస్తుందా ” అనే అంశంపై దేశ వ్యాప్తంగా సెమినార్లు నిర్వహించి అంబేద్కర్ రాజకీయ భావజాలాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లిన మహనీయుడు మాన్యశ్రీ కాన్షీరామ్. 1980వ సంవత్సరంలో “అంబెడ్కర్ మేళ రథయాత్ర “పేరుతో అంబేద్కర్ జీవిత పోరాటన్ని ఫోటోలు, చిత్రపటాల తో ప్రదర్శిస్తూ 9 రాష్ట్రాలలో అంబేద్కర్ సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన మహనీయులు మాన్యశ్రీ కాన్షీరామ్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు అనగారిన వర్గాల ప్రజలు అడుక్కునే స్థాయి నుంచి అధికారం సాధించే స్థాయికి ఎదగాలని తన ప్రసంగాలలో పదే పదే కార్యకర్తలకు వివరిస్తూ క్లుప్తంగా బోధించేవాడు. బాంసెఫ్ సంస్థ ద్వారా వేలాది క్యాడర్ క్యాంపులు సెమినార్లు వర్క్ షాపులు నిర్వహించి ఏ అనగారిన సమాజానికి చెందినవారమో ఆ సమాజానికి తిరిగి కృతజ్ఞతలు చెల్లించాలని ప్రబోధిస్తూ లక్షలాది కార్యకర్తలను అంబేత్కర్ఇస్టులు గా మలిచి రాబోయే కాలంలో అగ్రకుల పార్టీల తో జరగబోయే రాజకీయ యుద్ధానికి బహుజన సైన్యాన్ని ముందుగా కాన్షీరామ్ సైన్యాన్ని తయారు చేసి పెట్టాడు. బహుజన నాయక్ బహుజన సంఘటన్ పత్రికలు కాన్షిరాం నడిపాడు. బుద్ధిష్ట్ రిసెర్చ్ సెంటర్ స్థాపించాడు. అప్పటివరకూ ఉన్న దళిత సంఘాలు దళిత ఉద్యమాల తో పోలిస్తే బాంసెఫ్ విభిన్నమైనది. ఉద్యోగులు ఉద్యమాలలో పాల్గొనకూడదని నిర్ణయించడం ద్వారా బాంసెఫ్ కు ప్రత్యేక రాజకీయ దిశ ను నిర్ణయించడంలో కాన్షిరాం తనదైన శైలిని ప్రదర్శించాడు.

వెనుకబడిన కులాలను అణగారిన కులాలను మైనార్టీలను చేర్చుకోవడం మొదటినుంచి బాంసెఫ్ కొనసాగించింది. ఈ బాంసెఫ్ సంస్థలో ఉద్యోగులు 3 వేలమంది ఎం బి బి ఎస్ లు- ఎం డి లు, 15వేల మంది సైంటిస్టులు ఉండేవారు, తరువాత కాలంలో ఏర్పాటు చేయబోయే రాజకీయశక్తి కి సహకరించేందుకు బాంసెఫ్ ను సంస్థాగతంగా కాన్షీరామ్ తీర్చిదిద్దాడు. 1982వ సంవత్సరంలో కాన్షీరామ్ దళిత్ షోషిత్ సమాజ్ సంఘర్ష్ సమితి డియస్4 స్థాపించాడు. బాంసెఫ్ అనేది అనగారిన దోపిడికి గురవుతున్న బహుజనసమాజానికి మేధోశక్తిగా, నైపుణ్య శక్తిగా ఆర్థిక శక్తిగా ఉపయోగపడి ఆ సమాజాన్ని ముందుకు నడిపించే ఒక మిషన్. ఏ అనగారిన సమాజానికి చెందినవారమో ఆ సమాజానికి కృతజ్ఞత చెల్లించడం “పే బ్యాక్ టు ద సొసైటీ” బాంసెఫ్ ఉద్దేశ్యం. ఇలా ఉత్తరాదిన రాజకీయ కార్యాచరణ చాలా వేగంగా ఉరకలెత్తిoది. చాలా తక్కువ నిధులు ఉన్నప్పటికీ అగ్రకుల రాజకీయ అధికారాన్ని కూల్చాలిఅంటూ కాన్షిరాం చేసిన విస్తృత ప్రచారం “ఓట్ హమారా,రాజ్ తుమారా – నహీ చలేగా, నహీ చలెగా “( ఓటు మాది, రాజ్యం మీది – ఇక సాగదు,ఇక సాగదు) అనే నినాదంతో ఉదృతంగా ప్రజల్లోకి వెళ్ళాడు కాన్షీరాం. కాన్షీరామ్ కార్యకర్తలకు అర్థమయ్యే సులభశైలిలో భారతీయ కుల సమాజాన్ని విశ్లేషించే వాడు. పెన్ను నిలువుగా పట్టుకొని కులవ్యవస్థలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అట్టడుగున ఒకరిపై నిలువుగా పేర్చపడ్డారని సులువుగా “నిచ్చెనమెట్ల అసమానత్వం” గురించి కాన్షిరం వివరించేవారు. కులాన్ని కులంతోనే ధ్వంసం చేయాలని కులాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటే బహుజనులు పాలకులుగా ఎదగ గలరని కాన్షీరాం చెప్పేవాడు.

కాన్షీరాం ఎప్పుడూ తనను నాయకునిగా ప్రకటించుకోలేదు తాను బహుజన సమాజాన్ని నిర్మించే ఒక ఉద్యమ ఆర్గనైజర్ నని ఆయన ఎప్పుడూ అంటుండే వాడు. 1981 వ సంవత్సరం డిసెంబర్ 6న దళిత్ శోషిత్ సమాజ్ సంఘర్షణ సమితి డిఎస్ 4 ఉద్యమ సంస్థను కాన్షిరం ఏర్పాటు చేశాడు.

పోరాటం చేస్తే అధికారం వస్తుంది అనే నినాదంతో డిస్ 4పునాది వేయడం ప్రారంభించింది. డిస్4ద్వారా లక్షలాది మంది కార్యకర్తలను కాన్షిరాం తయారు చేయగలిగాడు. చిన్న సాధనాలను అత్యధికంగా ఉపయోగించి పెద్ద సాధనలు కలవారని ఓడించండి అని కార్యకర్తలకు కాన్షీరాం ఎపుడు బోధిస్తూ ఉండేవాడు. 1982వ సంవత్సరం ఉత్తరాదిన 9 రాష్ట్రాల్లో డిఎస్4 నాలుగు వేల కిలోమీటర్ల సైకిల్ యాత్రను కాన్షిరాం నేతృత్వంలో నిర్వహించడం జరిగింది . కాన్షీరామ్ స్వయంగా ఈ యాత్రలో పాల్గొనేవాడు. అంబేద్కర్ రాజకీయ సిద్ధాంతాన్ని విస్తృతంగా డిఎస్4 బహుజన లోకి ప్రచారం చేసింది. 1985 సెప్టెంబర్ 25 వ తేదీన మాన్యశ్రీ కాన్షీరామ్ తన చరిత్రాత్మక గ్రంథం “చెంచాయుగం” పుస్తకం రాసి విడుదల చేయడం జరిగింది.

Kanshi-Ram-1024x576 కులాన్ని నిర్మూలిద్దాం - బహుజన సమాజాన్ని నిర్మిద్దాం : కాన్షీరామ్ జీవిత విశేషాలు..

అగ్రకుల రాజకీయ పార్టీలోని దళిత నాయకులు గురించి కాన్షీరాం ఇలా వ్యాఖ్యానించారు. మన వాళ్ళు పోరాటం లేదని కాదు. వారు కూడా పోరాడుతున్నారు. అయితే వారు మన కోసం పోరాడటం లేదు. వేరే వాళ్ల కోసం వారి చెంచాలు గా మారి పోరాడుతున్నారు. ఇప్పుడు మనం చెంచాయుగం లో ఉన్నాం. ఇది దళారీ యుగం. అందుకే వారు దళారీ పోరాటం చేస్తున్నారు. తిరస్కరణ చేతగాని చెంచాలు షెడ్యూల్ కులాల్లో, ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్న చెంచాలు షెడ్యూల్ తెగల్లో, ఆసక్తిగా ముందుకొస్తున్న చెంచాలు వెనుకబడిన తరగతుల్లో నిస్సహాయ చెంచాలు మైనార్టీ లోనూ ఉన్నారని కాన్షీరామ్ విశ్లేషించే వారు. ఏమి తెలియని చెంచాలు చైతన్యం పొందిన అంబేద్కరైట్ చెంచాలు, చెంచాల కు చెంచాలు విదేశాల్లో ఉంటున్న చెంచాలు… ఇలా రక రకాలుగా చెంచాలు తయారయ్యారని కాన్షీరామ్ తన చెంచాయుగం పుస్తకంలో పేర్కొన్నాడు. చెంచులకు వ్యతిరేకంగా నిజాయితీ కలిగిన సమర్థ నాయకత్వాన్ని తయారుచేయాలని కాన్షీరామ్ పేర్కొన్నాడు. ఇందుకోసం స్వల్పకాలిక సామాజిక కార్యాచరణ ఉద్యమాన్ని చేపట్టాలని తద్వారా చెంచా యుగాన్ని ఎదుర్కోవాలని కాన్షిరాం చెప్పారు. అయితే దీర్ఘకాలిక రాజకీయ కార్యాచరణ ద్వారానే చెంచా యుగాన్ని అంతం చేయగలమని తన గ్రంథంలో కాన్షిరాం పేర్కొన్నాడు. అందుకోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు కు తనదైన సొంత పార్టీ ఉండాలని కాన్షిరాం చెంచాయుగం పుస్తకంలో తెలిపాడు.


1983 డిసెంబర్ 6వ తేదీ నుండి 1984 మార్చి 15 వరకు దేశవ్యాప్తంగా సమత మరియు ఆత్మగౌరవం పేరుతో దేశం నలుమూలల నుండి ఆందోళన కార్యక్రమాన్ని డిస్స్4 చేపట్టింది. వంద రోజుల పాటు సాగిన ఈ యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా 7000 సమావేశాలు నిర్వహించింది. 1984 మార్చి 16 తేదీ నుంచి ఏప్రిల్ 16 వరకు “ఈ దేశానికి బహుజనుల పాలకులు” అనే నినాదంతో దేశవ్యాప్తంగా డీఎస్4 ప్రచారం చేసింది. 1984 సంవత్సరం ఏప్రిల్ 14న ఢిల్లీలో లక్షలాదిమంది ప్రజల సమక్షంలో నీలి జెండా రెపరెపలాడగా “బహుజన్ సమాజ్ పార్టీ” ఆవిర్భవించింది. బహుజనుల్లో ఓటు చైతన్యాన్ని పెంచేందుకు వారు తమ ఓటు తమకే వేసుకునేందుకు, అగ్రకుల పార్టీలకు ఓటును అమ్ముకోకుండా ఉండేందుకు కాన్షీరామ్ విస్తృతంగా రాజకీయ చైతన్య ప్రచారాన్ని నిర్వహించడు.

కాన్షీరాం రాజకీయ భావజాలం : అన్ని కార్యక్రమాలలో బాంసెఫ్, బి ఎస్ పి లు ఎటువంటి స్పష్ట రాజకీయ మేనిఫెస్టో ని ప్రకటించక పోవడం విశేషం. కుల నిర్మూలన అగ్రకుల ఆధిపత్యం కూలగొట్టిఎందుకు దోపిడీకి, అణచివేతకు గురవుతున్న వారిని సమీకరించడం . సమానత్వం కోసం, వ్యవస్థను కూల్చి మార్చడం. వంటి పదాలు కాన్షిరం విరివిగా ఉపయోగించేవాడు. ఇవి అన్నీ కూడా సాంఘిక పదాలుగానే ఉపయోగించేవాడు. అయితే కాన్షీరామ్ ఇలా అన్నాడు. మా ఉద్యమానికి ఇది అనే భావజాలం ఇంకా ఏర్పరచు కోలేదు. కుల నిర్మూలన కోసం ఉద్యమం ఇండియా అంతటా కొనసాగుతోంది అని కాన్షీరామ్ చెబుతుండేవాడు. మా ప్రచారం పూర్తయ్యాక చివరగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన సెమినార్ కు అన్ని కులాల నుంచి పార్టీ నుంచి ప్రతినిధులను పిలుస్తాం. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఏకాభిప్రాయానికి వస్తాము అని కాన్షీరామ్ అంటుండేవాడు. డీఎస్4 బాంసెఫ్ ఉద్యమాలు, ప్రచారాలు కూడా సాంస్కృతిక -రాజకీయాలతో నిండి ఉండేవి. ఇవన్నీ కూడా చైతన్యవంతమైన సమావేశాలు. భారతదేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి భారీ సైకిల్ ర్యాలీలు, మేలులు, ప్రజా పార్లమెంట్లు నిర్వహించేవారు. కేవలం ఒకే సారి 1987 -88 వ సంవత్సరం లో మద్యపాన వ్యతిరేక ఉద్యమం చేపట్టారు.

ఇంకొక విషయం ప్రముఖంగా ప్రస్తావించాలి ఇక్కడ. బిఎస్పి ప్రచారంలో వ్యతిరేక ప్రచారం తక్కువ. ఇతర దళిత ఉద్యమం లాగా అగ్రకులాల పై మౌఖిక దాడి ఉండేది కాదు. అగ్రకుల రాజకీయ నాయకుల పై వ్యక్తిగత విమర్శలు ఉండేవికావు. ఎస్సీ బీసీలను ఐక్యం చేయడమే పాజిటివ్ నిర్మాణ సూత్రాన్ని ఎక్కువగా పాటించేవారు కాన్షిరం. సంఘటనలు,సమస్యలు లాంటి వాటి పై వ్యాఖ్యానించే వారు కాదు. హేతువాదం మానవత్వం నాస్తికవాదం పూలే పెరియార్లు చెప్పినవి ఎక్కువగా ఆయన మాటల్లో కనిపించేవి. కాన్షిరాం గొప్ప వ్యూహకర్త ఎన్నికల ప్రచారంలో ఆయన బహుజన రాజకీయ అధికారo సిద్ధాంతాన్ని అద్భుతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేవారు. రెండు దశల విప్లవ సిద్ధాంతాన్ని కాన్షీరామ్ ప్రతిపాదించారు. మొదటి దశలో బహుజనులు సమీకృత మై ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకోవాలి. రెండవ దశలో ఆ ప్రజాస్వామిక విప్లవాన్ని స్టిరికృతం చేసుకుంటూ రాజకీయ అధికారాన్ని ఉపయోగించి సమాజంలో చొచ్చుకొని పోయి సామాజిక పరివర్తన, ఆర్థిక విముక్తి సాధించి బహుజనులకు విమోచన కల్పించాలి.


నిరంతర గతిశీలత కలిగిన రాజకీయ కార్యక్రమాలు రూపకల్పన చేసి పార్టీని నిరంతరం కాన్షీరామ్ ముందుకు నాడిపారు. కాన్షీరామ్ ఒక మిషనరీ లాగా ఆయన రాజకీయాలు నడిపాడు. ఇతర అంబేద్కర్ రైట్ రాజకీయ పార్టీలకు భిన్నంగా బిఎస్పి రాజకీయ ప్రస్థానం కాన్షీరామ్ నేతృత్వంలో స్థిరంగా బలంగా ముందుకు సాగింది . ఆరువేల కులాలుగా చీలిపోయి నిచ్చెనమెట్ల అసమానత్వం లో బందీలుగా ఉన్న బహుజనులను ఏకంచేసి సోషల్ ఇంజనీరింగ్ సూత్రాన్ని కాన్షీరామ్ పకడ్బందీగా కార్యకర్తలకు బోధించి బి ఎస్ పి ని పటిష్టం చేశాడు. రాజకీయ హక్కులు సాధించుకునేందుకు మీరు రాజకీయ అధికారాన్ని సాధించు కోండి అని బాబాసాహెబ్ ఇచ్చిన సూచనలను కాన్షీరామ్ తన మెథడాలజీ ద్వారా ఆచరణలోకి తేగలిగాడు. రాజకీయ కార్యాచరణ ద్వారా సామాజిక పరివర్తన, ఆర్థిక విముక్తి సాధ్యమని కాన్షీరామ్ దృఢంగా విశ్వసించేవాడు.


చిన్న సాధనాలు సైకిళ్లను పెద్ద ఎత్తున వేలాది కార్యకర్తలు ఉపయోగిస్తూ కాన్షీరామ్ తరపున ప్రచారం నిర్వహించేవారు. కాన్షీరామ్ “ఒక ఓటు- ఒక నోటు ” ఇవ్వండని బహుజనులను అభ్యర్థించేవాడు.1989వ సంవత్సరంలో చారిత్రాత్మక మహాసభలను దేశం నలుమూలలా బీఎస్పీ నిర్వహించింది. “షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి బీఎస్పీ తోనే సాధ్యం” అనే అంశంపై మహాసభ ఢిల్లీలో జరిగింది. “ముస్లింల అభివృద్ధి బీఎస్పీ తోనే సాధ్యం “అనే అంశం పై మహాసభ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లో జరిగింది. “వెనుకబడిన తరగతుల అభివృద్ధి బీఎస్పీ తోనే సాధ్యం “అనే అంశంపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. “సిక్కుల అభివృద్ధి బీఎస్పీ తోనే సాధ్యం “అనే అంశం పై కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో మాహసభలు నిర్వహించారు. ఈ సభలు విజయవంతం చేయడానికి కాన్షీరాం 130 రోజులు అవిశ్రాంతంగా కష్టపడి పని చేశాడు.

Kanshi-Ram-Bahujan-Nayak-1024x576 కులాన్ని నిర్మూలిద్దాం - బహుజన సమాజాన్ని నిర్మిద్దాం : కాన్షీరామ్ జీవిత విశేషాలు..


కాన్షీరామ్ రాజకీయ వనరులు రెండు మార్గాల ద్వారా సమకూర్చుకున్నాడు. ఒకటి కార్యకర్తలను తయారు చేసి పటిష్టమైన రాజకీయ పార్టీ నిర్మించడం. రెండు బహుజనుల సాంస్కృతిక అంశాలను రాజకీయ అధికారం అనే అంశాలపై చర్చ గా మార్చడం. కాన్షీరాం తరచూ ఇలా అంటుండేవారు, రాజకీయ ఉద్యమాన్ని ఎలా నడపాలో నేను బాబాసాహెబ్ నుంచి నేర్చుకున్నాను అని అంటాడు. రాజకీయ ఉద్యమాన్ని ఎలా నడపకూడదో మహారాష్ట్రఅంబేత్కర్ రిస్టులను చూసి నేర్చుకున్నాను అని అంటుండేవాడు. కాన్షీరామ్ తన రాజకీయ యోగం ఎత్తుగడల ద్వారా అంబేద్కర్ రాజకీయ ప్రస్థానాన్నిముందుకు కొనసాగించారు. ఫలితంగా అత్యధిక జనాభా క జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి బహుజన నాయకురాలు మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసి రాజ్యాధికారం అంటే ఏంటో చూపించాడు . అందుకు కాన్షీరామ్ పార్టీ నిర్మాణానికి వేసిన బలమైన పునాదే కారణం.

అగ్రకుల రాజకీయ పార్టీలు ఇంతవరకు అట్టడుగు సమాజాన్ని ఓటర్లుగా చూశాయి. వారి నాయకులను చెంచాలు గా తయారు చేశాయి. మాన్యశ్రీ కాన్షీరామ్ అట్టడుగు సమాజం నుంచి నీతి, నిజాయితీ, నిబద్ధత సమర్ధత, కలిగిన లక్షలాది నాయకులను కార్యకర్తలను తయారు చేశాడు. తన పని విధానం తో కింది వర్గాల ప్రజలు ఉన్నత వర్గాలను ఎలా పరిపాలించలో ఆచరణలో చేసి చూపించాడు. బానిస కులాలను పాలక కులాలుగా ఎదిగించాడు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అసంపూర్తిగా ఉన్న ఉద్యమాన్ని కాన్షీరాం పూర్తి చేశాడు. రాజకీయ వ్యూహ రచనలో అంబేద్కర్ కు కాన్షీరామ్ ఏకరూపత ఉండేది. బహుజనులు తమంత తాము సమీకృతమైన రాజకీయ శక్తిగా ప్రభావశీలూరుగా ఎదిగితే ఆధిపత్య కులాల పార్టీలు మద్దతు కోసం బహుజనులు రాజకీయ పార్టీ వద్దకు వస్తాయని అప్పుడే అధికారాన్ని నియంత్రించే స్థాయికి బహుజనులు ఎదుగుతారని కాన్షీరాం భావించేవారు. రాజకీయ అధికారం చేతిలో ఉండటంతో అనేక సామాజిక పరివర్తన, సాంస్కృతిక పునరుజ్జీవ, ఆర్థిక విమోచన కార్యక్రమాలను బీఎస్పీ అమలు చేయగలిగింది.

అన్నింటికీ మించి బహుజనులు కూలిపోయిన ఆత్మగౌరవాన్ని తిరిగి వారికి ప్రసాదించింది. కాన్షీరామ్ కార్యకర్తలకు కార్యకర్త, ఆర్గనైజర్ లకు ఆర్గనైజర్ వ్యూహకర్తలకు వ్యూహకర్త, నాయకులకు నాయకుడు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిజమైన వారసుడు కాన్షీరాం. “మన అంతిమ లక్ష్యం ఈ దేశాన్ని పరిపాలించడం, మరిచిపోకుండా ఈ విషయాన్ని మీ ఇంటి గోడలపై రాసుకోండి ” అని బాబా సాహెబ్ అన్న మాటలను కాన్షీరాం యూపీలోని నిజం చేసి చూపించాడు. నేడు తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి కాన్షీరాం నిర్మించినఅటువంటి గొప్ప సిద్ధాంతం పైన డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ గ్రామాన తిరుగుతూ బహుజనులను చైతన్యం చేస్తున్నాడు. తెలంగాణలో కూడా బహుజన రాజ్యం రావాలని మనమందరం కోరుకుందాం. అదే విధంగా మాన్యశ్రీ కాన్షీరామ్ చూపిన బాటలో నడిచి బహుజన రాజ్యాధికార లక్ష్యాన్ని సాధించడమే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి.

WhatsApp-Image-2022-08-17-at-9.10.53-PM-680x1024 కులాన్ని నిర్మూలిద్దాం - బహుజన సమాజాన్ని నిర్మిద్దాం : కాన్షీరామ్ జీవిత విశేషాలు..

రచయిత:

కర్రోల్ల రాజు బహుజన్,
బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు,
ఫోన్ 7093116119.

Share this content:

You May Have Missed