Breaking
Tue. Nov 18th, 2025

దేశంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా వైరస్

Centre sends high-level multi-disciplinary teams to 10 states for Covid management
Centre sends high-level multi-disciplinary teams to 10 states for Covid management
  • 10 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలు
  • వైర‌స్ వ్యాప్తి. నివార‌ణ చ‌ర్య‌ల‌పై అధ్య‌య‌నం

దేశంలో కరోనా మహమ్మారి (కోవిడ్-19) ప్రభావం మళ్లీ పెరుగుతోంది. చాపకింద నీరులా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం వైర‌స్ వ్యాప్తి అధికంగా ఉన్న 10 రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక బృందాల‌ను పంపింది. ఈ బృందాలు ఆయా రాష్ట్రాలతో స‌మ‌న్వ‌య‌మై క‌రోనా క‌ట్ట‌డికోసం ప్ర‌య‌త్నాలు చేయ‌నుంది. కాగా, 24 గంటల్లో కొత్తగా 16,752 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 1,10,96,731 చేరింది.

ఇదే సమయంలో మొత్తం 113 మంది వైరస్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,57,051కి పెరిగింది. ఇక కొత్తగా 11,718 మంది కోలుకున్నారు. దీంతో మొత్త కరోనా వైరస్ రికవరీల సంఖ్య 1,07,75,169కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.10 శాతంగా, మరణాల రేటు 1.42 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 1,64,511 ఉన్నాయి.

కాగా, ఇప్పటివరకు దేశంలో మొత్తం 21,62,31,106 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 1,95,723 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది. ఇదిలా ఉండగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 1,43,01,266 మందికి టీకాలు అందించారు.

ఇక దేశంలో కొత్తగా నమోదైన కేసుల్లో 86.37 శాతం మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్నాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. మొత్తంగా అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర (21,46,777 కేసులు, 2,092 మరణాలు) మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో కేరళ, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఒడిశా, రాజస్థాన్, చత్తీస్ గఢ్ లు ఉన్నాయి.

రోజూ మందు కొడుతున్నారా.. మీరు కాకరకాయను తినాల్సిందే ! లేకుంటే…

సల్లంగ సూడు తల్లీ.. మళ్ళేడు మళ్ళీ వస్తాం..!

అందానికి.. ఆరోగ్యానికి గోరింటాకు !

టీవీ, మొబైల్స్.. డెంజ‌ర్‌లో టీనేజ‌ర్స్ !

Related Post