Breaking
Tue. Nov 18th, 2025

క‌ల్తీ మ‌ద్యం.. 8 మంది మృతి

Consuming Illicit Spurious Liquor
Consuming Illicit Spurious Liquor

దర్వాజ-లక్నో

Consuming Illicit Spurious Liquor : క‌ల్తీ మ‌ద్యం తాగి 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఆగ్రా జిల్లాల్లో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకెళ్తే.. తాజ్‌గంజ్‌ పరిధిలోని నాగ్లా డియోరిలో నలుగురు, దౌకిలోని కౌలారా కలాన్‌లో ముగ్గురు, బార్కులాలో ఒకరు మృతి చెందారు. కల్తీ మద్య సేవించ‌డం కార‌ణంగానే వారు ప్రాణాలు కోల్పోయార‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు కేవ‌లం ఆరు మ‌ర‌ణాలు మాత్ర‌మే న‌మోద‌య్యాయ‌నీ పేర్కొన్నారు. దీనిపై కేసు న‌మోదుచేసుకున్నామ‌ని ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ద‌ని తెలిపారు.

కాగా, దౌకి గ్రామానికి చెందిన నలుగురు గత ఆదివారం మద్యం సేవించారు. ఆ తర్వాత వారి ఆరోగ్యం క్షీణించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండ‌గా ముగ్గురు చ‌నిపోయారు. ఆ త‌ర్వాతి రోజు మ‌రొక‌రు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండ‌గా, డియోరి గ్రామంలో న‌లుగురు మ‌ర‌ణించారు. వీరు కూడా క‌ల్తీ మ‌ద్యం కార‌ణంగానే చ‌నిపోయార‌ని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది.

Related Post