దర్వాజ-నేషనల్
Corona Bulletin: ఒక వైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్.. ఈ రెండింతో జనాల కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్.. సెకండ్ వేవ్ భారిన పడి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది దిక్కులేని పక్షులయ్యారు. అంతటితో ఆగకుండా డెల్టా వేరియంట్ విరుచుకుపడుతుంది. అది సరిపోలేదన్నట్టు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా ప్రజలను గజ్జున వణికిస్తోంది. ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా.. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు. ఇతర దేశాల్లో కరోనా ఏ రేంజ్ లో వ్యాపిస్తుందో నిత్యం మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం.
ఇక తాజాగా భారత్ లో కూడా కరోనా వ్యాప్తి భయంకరంగా మారింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. వీటిని చూస్తుంటే థర్డ్ వేవ్ అటాక్ చేసిందా అనే అనుమానాలు పుట్టిస్తున్నాయి. మూడు రోజుల నుంచి ఈ కొత్త కేసుల సంఖ్య 10,000 లకు పైనే నమోదయ్యాయి. ఇక ఈ రోజు ఏకంగా 16 వేలకు పైనే కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో 16,764 మంది కరోనా భారిన పడ్డారు. నిన్న ఒక్క రోజే 220 మంది మరణించగా.. 7,585 మంది కొత్తగా కోలున్నారు.
కాగా భారత్ లో ఇప్పటితో కరోనా కేసుల సంఖ్య 3,48,38,804కి చేరుకోగా.. అందులో 3,42,66,363 మంది ఇప్పటి వరకు కోలుకున్నారు. ఈ మహమ్మారి భారిన పడి ఇప్పటి వరకు 4,81,080 ప్రాణాలు కోల్పోయారు. ఇక తాజాగా 91,361 కరోనా యాక్టీవ్ కేసులున్నట్టు తెలుస్తోంది. కరోనా శరవేగంగా వ్యాపిస్తున్న వేళ కొన్ని రాష్ట్రాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. అందులో మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. నిన్నఒక్కరోజే అక్కడ ఏకంగా 5,368 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రాణాలను కాపాడుకోవాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.
Samantha: ఏంటీ సమంత వర్కౌట్స్ చేసేది ఇందుకోసమా..?
Krithi Shetty : సన్నజాబి పువ్వులా మెరిసిపోతున్న బేబమ్మ.. మరీ ఇంత అందమేంటిరా బాబూ..
Hair Problem Tips: వెంట్రుకలకు నూనె రాసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు అస్సలు ఊడదు..
Deepika Pilli: ఏమి అందం ఏమి అందం.. దీపిక పిల్లి మరీ ఇంత అందంగా ఎలా పుట్టావమ్మా..
Sweater Dangers: చలికాలంలో స్వెటర్ వేసుకుని పడుకుంటున్నారా..? అయితే మీకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినట్టే.?
Share this content: