Breaking
Tue. Nov 18th, 2025

సెలవు దక్కలేదనే కోపంతో కాల్పులు.. నలుగురు జవాన్లు మృతి

CRPF Fire
CRPF Fire

ద‌ర్వాజ‌-రాయ్ పూర్
CRPF Constable Opens Fire: దీపావళికి సెలవు దక్కలేదనే కోపంతో తోటి జవాన్ల ప్రాణాలు తీసాడు . ఈ అమానుష ఘటన తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులలోని సీఆర్పీఎఫ్ క్యాంప్ లో జరిగింది. ఈ కాల్పుల్లో మొత్తం ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా ఇందులో నలుగురు జవాన్లు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మిగతా ముగ్గురు జవాన్లను భద్రాచలం ఏరియా హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే ఈ దారుణానికి పాల్పడింది కానిస్టేబుల్ రితేష్ రంజన్. రితేష్ సోమవారం తెల్లవారు జామున 3.15 కి సుక్మా జిల్లా పరిధిలోని లింగంపల్లి బేస్ క్యాంప్ లో కాల్పులు జరిపాడు. తన దగ్గరున్న సర్వీస్ రివాల్వర్ ఏకే-47తో తన తోటి జవాన్లపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో రాజమణి కుమార్ యాదవ్, రాజవివ్ మండల్, ధన్ జీ, ధర్మేంద్ర కుమార్ లు చనిపోయారు.

కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆస్పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం రాయపూర్ కు తరలించారు. ఇకపోతే ఈ కాల్పులకు పాల్పడిన కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. దీనికి అసలు కారణం సెలవులేనా.. లేకపోతే ఇంకో కారణమేదైనా ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. అడవుల్లో మావోయిస్టులతో పోరాడే జవాన్లు వారిలో వారికే గొడవలు పడి ఇలా కాల్పులు జరుపుకోవడం.. చంపడంతో అక్కడి ఉన్నతాధికారులంతా ఆందోళన చెందుతున్నారు.

https://youtube.com/watch?v=-62KOANQanM

Chapped Lips Tips:చలికి పెదవులు పగులుతున్నాయా? అయితే ఈ టిప్స్ మీ కోసమే..

Gold Price:మళ్లీ పెరిగిన బంగారం ధరలు

27 శాతం పెరిగిన వ్యాపారుల ఆత్మహత్యలు

త‌మిళ‌నాడులో దంచి కొడుతున్న వాన‌లు

కండ్లు పీకేస్తాం.. చెయ్యి నరికేస్తాం.. : బీజేపీ ఎంపీ

స్నానం ఏ సమయంలో చేస్తే మంచిది?

దుమ్ములేపుతున్న ‘లాలా భీమ్లా నాయ‌క్’ ప‌వ‌ర్ ఫుల్ సాంగ్ !

Related Post