Loading Now
Dera Baba

డేరా బాబాకు జీవిత ఖైదు

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

Dera Baba: డేరా బాబా ( డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్) మరో కేసులో దోషిగా తేలారు. తన అనుచరుడు, డేరా సచ్చా సౌదా మేనేజర్‌గా వ్యవహరించిన రంజిత్ సింగ్ హ‌త్య కేసులోనూ ఆయ‌న దోషిగా తేలారు. ఈ నెల 8నే రంజిత్ సింగ్ హత్య కేసులో పంజకులలో సీబీఐ స్పెష‌ల్ కోర్టు డేరా బాబాతోపాటు మరో నలుగురిని దోషులగా తేల్చింది. అయితే, శిక్షను వాయిదా వేసింది. సోమ‌వారం విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం డేడా బాబాకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. ఆయ‌న‌తో పాటు క్రిషన్ లాల్, జస్బీర్ సింగ్, అవతార్ సింగ్, సబ్దిల్‌లకూ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో పాటు రూ.31 ల‌క్ష‌ల జ‌రిమానా కూడా విధించింది.

డేరా సచ్చా సౌదాలో మహిళలపై, మహిళా అనుచరులపై డేరా బాబా లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడుతున్నాడని ఓ అనామక లేఖను డేరాబాబా మేనేజర్‌గా పనిచేసిన రంజిత్ సింగ్ ప్రచారం చేస్తున్నారని డేరా బాబా అనుమానించారు. దీనిపై సంచలన కథనం రాసిన జర్నలిస్టు రామ చందర్ ఛత్రపతి హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ క్ర‌మంలోనే డేరా బాబా చేస్తున్న దారుణాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ కేసులో డేరా బాబా దోషిగా తేలారు. ఇదిలావుండ‌గా, త‌న ఆశ్ర‌మంలో ఇద్ద‌రిపై లైంగిక‌దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌లో డేరా బాబాకు 20 ఏండ్ల జైలు శిక్ష‌ను అనుభ‌విస్తున్న సంగ‌తి తెలిసిందే.

3.9% మంది పిల్లల్లో పోషకాహార లోపం !

కేరళలో భారీ వర్షాలు.. 25 మంది మృతి

జ‌మ్మూకాశ్మీర్‌లో ఉగ్ర‌వాదుల టార్గెట్..

రైతుల రైల్ రోకో

వైద్యురాలికి మత్తు మందు ఇచ్చి లైంగిక‌దాడి చేసిన ఎయిమ్స్ డాక్ట‌ర్

కేర‌ళ‌ను ముంచెత్తిన వ‌ర‌ద‌లు.. 10 మంది మృతి

అంబరాన్నంటిన ‘బతుకమ్మ’ సంబురాలు

Share this content:

You May Have Missed