నేను బీజేపీ ఎంపీని.. ఈడీ నా జోలికి రాదు

BJP MP Sanjay Patil
BJP MP Sanjay Patil

•  బీజేపీ ఎంపీ సంజయ్‌ పాటిల్‌


ద‌ర్వాజ‌-ముంబ‌యి
BJP MP Sanjay Patil : తాను బీజేపీ నుంచి ఎంపీని అయినందున ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తన జోలికి రాదని బీజేపీ ఎంపీ సంజయ్‌ పాటిల్‌ అన్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ఆయ‌న‌.. ఆదివారం జ‌రిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈడీని ఎగతాళి చేస్తూ వ్యాఖ్య‌లు చేయ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

‘నేను బీజేపీ ఎంపీని కాబట్టి ఈడీ నా జోలికి రాదు. రూ.40 లక్షల కారు కొనేందుకు మేం లోన్‌ తీసుకోవాల్సి వస్తున్నది. మాకున్న రుణం చూస్తే ఈడీ ఆశ్చర్యపోతుంది’ అని బీజేపీ ఎంపీ సంజ‌య్ పాటిల్ అన్నారు. ఇటీవ‌లి కాలంలో బీజేపీ నేత‌లు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం మ‌రింతగా పెరుగుతుండ‌టం గ‌మ‌నార్హం. కొన్ని రోజుల కింద‌ట మరో బీజేపీ నేత హర్షవర్ధన్‌ పాటిల్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. బీజేపీలో ఉన్నవారిపై ఎలాంటి దర్యాప్తులు ఉండవనీ, హాయిగా కాలం వెళ్లదీయవచ్చని అన్నారు.

కాగా, కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను కేంద్రంలోని ప్ర‌ధాని మోడీ స‌ర్కారు త‌న చెప్పుచేత‌ల్లో పెట్టుకుని ప్ర‌తిప‌క్షాల‌ను టార్గెట్ చేస్తున్న‌ద‌ని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో మ‌ద్రాస్ హైకోర్టు.. పంజ‌రంలో ఉన్న రామ‌చిలుక‌లా మారిన సీబీఐకి స్వేచ్ఛ క‌ల్పించాలంటూ వ్యాఖ్య‌లు సైతం చేయ‌డం ద‌ర్యాప్తు సంస్థ‌ల‌పై ప్ర‌భుత్వం ఒత్తిడి ఏ స్థాయిలో కొన‌సాగుతున్న‌దో అర్థం చేసుకోవ‌చ్చు.

Ind Vs Pak : భార‌త్‌-పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్

టాస్ కాయిన్‌తో పాక్ ఎకాన‌మీని పెంచుకుంటార‌ట‌.. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త సెటైర్లు

T20 World Cup: విండీస్‌పై ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాలో గెలుపు

T20 World Cup: విండీస్ చెత్త రికార్డు..

T20 World Cup: ప్ర‌పంచ‌ క‌ప్‌లో ఆస్ట్రేలియా బోణీ..

పెట్రోల్ ప‌న్నుల‌తోనే.. ఫ్రీ వ్యాక్సిన్లు.. :కేంద్ర మంత్రి హ‌ర్దీప్ సింగ్‌పూరీ

మళ్లీ పెంచిండ్రు..

పిల్లల్ని అతిగా పొగిడితే.. ?

Related Post