Loading Now
Farm Laws Repeal bill

చ‌ర్చ లేకుండానే.. సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

farm Laws Repeal bill : గ‌తంలో కేంద్రంలోని ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కారు తీసుకొచ్చిన వివాదాస్ప‌ద మూడు సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లును చ‌ర్చ లేకుండానే లోక్‌స‌భ ఆమోదం తెలిపింది. ఆ మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసేందుకు కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ లోక్‌స‌భ‌లో బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. ఇదే స‌మ‌యంలో ప‌లు అంశాల‌ను లేవ‌నెత్తుతూ ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు ఆందోళ‌న‌కు దిగారు. బిల్లుపై చర్చ నిర్వ‌హించ‌కుండానే సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు విప‌క్షాలు ఆరోపించాయి.

ఈ బిల్లుపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌద‌రీ డిమాండ్ చేశారు. విప‌క్షాల ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో మూజువాణి ఓటుతోనే బిల్లుకు ఓకే చెప్పేశారు. దీంతో విప‌క్ష స‌భ్యులు వెల్‌లోకి దూసుకువ‌చ్చారు. అయితే చ‌ర్చ‌ను చేప‌ట్టేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు చెప్పిన స్పీక‌ర్ బిర్లా.. ఆ గంద‌ర‌గోళం మ‌ధ్య స‌భ‌ను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు వాయిదా వేశారు. ఇదిలావుండ‌గా, టీఆర్ ఎస్ ఎంపీలు ధాన్యం కొనుగోలుపై చ‌ర్చ జ‌ర‌పాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలోనే వెల్‌లోకి దూసుకెళ్లి నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు.

MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్

ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?

సెల్ ఫోన్ను నిమిషం కూడా చూడకుండా ఉండలేకపోతున్నారా? డౌటే లేదు మీకు ఆ జబ్బులు వచ్చినట్టే..

పొట్టి గౌనులో పెద్ద పాప.. రంగమత్తా అది మర్చిపోయావా ఏంటి?

నీళ్లు మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తోందా.. ఈ వ్యాధి కావొచ్చు..

పూల పూల చీరతో పరువాల వాన కురిపిస్తున్న రష్మి

వచ్చే ఏడాది పండుగలు, సెలవులు ఇవే..

మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి..

Share this content:

You May Have Missed