దర్వాజ-లక్నో
farmers protest_Rail Roko : ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి వాహనం దూసుకెళ్లిన ఘటనలో 8 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లఖింపూర్ ఖేరి హింసకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలిపారు. సోమవారం (అక్టోబర్ 18) రైలు రోకో నిర్వహించాలని సంయుక్త్ కిసాన్ మోర్చా నిర్ణయించింది. ఇది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని పేర్కొంది. ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం కలుగజేయకుండా తమ నిరసన కొనసాగుతుందని వెల్లడించింది.
కాగా, లఖింపూర్ హింసకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేంద్ర మంత్రిని పదవి నుంచి తొలగించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర మంత్రి కారు నలుగురు రైతులపైకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది చనిపోయారు. ఇందులో నలుగురు రైతులు, జర్నలిస్టు ఉన్నారు. మంత్రి కుమారుడు అసిష్ మిశ్రా ఈ కేసులో ప్రధాన నిందితుడు. ఈ ఘటన జరిగినప్పుడు అతను కారు లోపల ఉన్నట్టు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి సైతం తీసుకుంది. అయితే, ఆశిష్ సంఘటన సమయంలో కారులో లేడని కేంద్ర మంత్రి చెప్పుకురావడం గమనార్హం.
వైద్యురాలికి మత్తు మందు ఇచ్చి లైంగికదాడి చేసిన ఎయిమ్స్ డాక్టర్
కేరళను ముంచెత్తిన వరదలు.. 10 మంది మృతి
అంబరాన్నంటిన ‘బతుకమ్మ’ సంబురాలు
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 400 స్థానాలు గెలుస్తాం..
బాల్య వివాహాలు.. ఏటా 22 వేల మంది బాలికలు బలి
2-18 వయస్సుల వారికి కరోనా వ్యాక్సిన్