Gold Prices: బంగారం కొనాలనుకునేవారికో గుడ్ న్యూస్..

Gold Prices
Gold Prices

దర్వాజ-హైదరాబాద్

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు ఎంత పెరిగినా జనాలు తప్పక బంగారాన్ని కొనాల్సి వస్తుంది. అయితే బంగారం ధరలు మంగళవారంతో పోల్చుకుంటే ఈ రోజు(బుధవారం) నాడు స్వల్పంగా తగ్గాయి. ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.49,100గా ఉండగా, అదే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000 ఉంది. అంటే నిన్నటి ధరలతో పోల్చుకుంటే పసిడి రేటు 110 రూపాయలు తగ్గింది.

కాగా వివిధ ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 47,990 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 46,990 గా పలుకుతోంది. అలాగే చెన్నైలో 24 క్యారెట్ల ధర పసిడి 10 గ్రాముల ధర 49,390 ఉండగా, 22 క్యారెట్ల ధర 45,270 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో అయితే ఏకంగా 24 క్యారెట్ల బంగారం ధర 51,400 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర 47,150 గా ఉంది.

ఇకపోతే కోల్ కతాలో 24 క్యారెట్ల బంగారం ధర 50,150 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 47,450 గా కొనసాగుతోంది. బంగారం ఈ విధంగా ఉండగా కిలో వెండి 64,800 రూపాయలుగా కొనసాగుతోంది. చెన్నైలో అయితే కిలో వెండి ధర 69,100 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇకపోతే హైదరాబాద్ లో అయితే కిలో వెండి రూ.69,100 గా ఉంది.

Hindi: మాకు హిందీ తెలియదు.. సీఎస్‌ను మార్చండి !

వామ్మో.. టూత్ పేస్ట్ తో పిల్లలకు ఇంత డేంజరా?

Crime : క్షణికావేశం.. తీసింది భర్త ప్రాణం..

వామ్మో నిద్ర పోకపోతే ఇంత పెద్ద సమస్యా?

Teenmar Mallanna: తీన్మార్ మ‌ల్ల‌న్న విడుద‌ల

పోషకాహార లోపంలో 33 లక్షల మంది చిన్నారులు

సెలవు దక్కలేదనే కోపంతో కాల్పులు.. నలుగురు జవాన్లు మృతి

Related Post