కండ్లు పీకేస్తాం.. చెయ్యి నరికేస్తాం..

Arvind Sharma
Arvind Sharma

• బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ద‌ర్వాజ‌-ఛండీగఢ్‌

Haryana BJP MP Arvind Sharma: బీజేపీ నాయకులు, కార్యకర్తల వైపు కన్నెత్తి చూస్తే కండ్లు పీకేస్తామని, చెయ్యి ఎత్తి చూపితే చెయ్యి నరికేస్తామంటూ రోహతక్‌ ఎంపీ, బీజేపీ నేత అర్వింద్‌ శర్మ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. హర్యానాకు చెందిన మాజీ మంత్రి మనీశ్‌ గ్రోవర్ రైతుల‌ను కించ‌ప‌రిచేలా చేసిన వ్యాఖ్య‌ల‌ను నిర‌సిస్తూ.. .ఆయ‌న‌తో పాటు కొంతమంది బీజేపీ నేతలను శుక్రవారం రోహతక్‌లోని ఓ ఆలయ కాంప్లెక్స్‌లో రైతులు, స్థానికులు ఘెరావ్ చేశారు. వివాదాస్ప‌ద మూడు కొత్త సాగు చ‌ట్టాలు ఉపసంహ‌రించుకోవాలంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఈ నేప‌థ్యంలోనే ఎంపీ అర్వింద్‌ శర్మ స్పందిస్తూ ‘గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత భూపేందర్‌ సింగ్‌ హుడా కుమారుడు దీపేందర్‌ హుడా ఓడిపోయారు. ఈ కారణంతోనే మనీశ్‌ గ్రోవర్‌పై పగ పెంచుకున్న కాంగ్రెస్‌ నేతలు ఇలాంటి నిర్బంధాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా మా నాయకులు, కార్యకర్తల వైపు కన్నెత్తి చూస్తే కండ్లు పీకేస్తాం. చెయ్యి ఎత్తి చూపితే వారి చేతులు న‌రికేస్తాం మంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

స్నానం ఏ సమయంలో చేస్తే మంచిది?

దుమ్ములేపుతున్న ‘లాలా భీమ్లా నాయ‌క్’ ప‌వ‌ర్ ఫుల్ సాంగ్ !

Sierra Leone: ఘోర ప్ర‌మాదం.. 92 మంది మృతి

Fire Accident: క‌రోనా ఆస్ప‌త్రిలో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

Climate Change: ప్ర‌కృతి విధ్వంసం.. ప్ర‌కోపం..

ప్ర‌పంచ నాయకుల న‌ట‌న !

Related Post