Breaking
Thu. Jun 5th, 2025

India Corona Updates: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?

Norovirus , Hyderabad

దర్వాజ-నేషనల్

India Corona Updates: దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కరోనాతో పాటుగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా దారుణంగా పెరుగుతున్నాయి. దానికి తోడు డెల్టా వేరియంట్ కూడా ప్రజలను తీవ్ర భయ బ్రాంతులకు గురిచేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక వైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్.. ఇంకో వైపు సాధారణ కేసులు కూడా విచ్చల విడిగా పెరిగిపోవడంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. దీని కట్టడికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

అయినా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గకపోగా .. రోజు రోజుకు ఇంకా ఇంకా పెరిగిపోతున్నాయి. దీనికి తోడు ఒమిక్రాన్ కేసులైతే భారీగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు దేశంలో 1,431గా ఒమిక్రాన్ కేసులు ఉండగా.. ఇప్పుడు ఈ సంఖ్య 1,525 కు చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ ఒమిక్రాన్ మన దేశంలో ఇప్పటి వరకు 23 రాష్ట్రాలకు వ్యాపించిందని కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా 460 ఒమిక్రాన్ కేసులు ఒక్క మహారాష్ట్రలో నమోదయ్యాయి.

ఆ తర్వాత ఢిల్లీలో 351 కేసులు వెలుగుచూసాయి. కాగా గుజరాత్ లో 136 కేసులు నమోదైతే.. తమిళనాడులో 117 కేసులు నమోదయ్యాయి. ఇకపోతే తెలంగాణలో ఈ కేసుల సంఖ్య 67 గా ఉంది. కాగా నిన్న ఒక్క రోజే 27,553 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులోనూ 284 మంది కరోనాతో నిన్న ఒక్క రోజే మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెళ్లడించింది. 9,249 మంది నిన్న ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఈ కష్ట కాలంలో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం ప్రజలకు సూచిస్తోంది.

Police Thieves: సెలబ్రేషన్స్ కోసం మేకలను దొంగలించిన పోలీస్.. మరీ ఇంత కక్కుర్తి ఏందయ్యా సామీ..?

Liquor Sales: మందు బాబులా మజాకా.. ఒక్క 5 రోజుల్లోనే ఇన్ని కోట్లు తాగేసారా..!

Deepthi Shanmukh Breakup: ఐపోయింది అంతా అయిపోయింది.. అనుకున్నట్టే దీప్తి సునైనా షణ్ముఖ్ కు బ్రేకప్ చెప్పేసిందిగా..

Pushpa Deleted Scene: పుష్ప సీన్ అదిరిపోలా.. మరెండుకు తీసేస్నారబ్బా..!

TS News : ‘తెలంగాణలో నేరాలు పెరిగినయ్’

Shriya Saran: భర్తను ముద్దులతో ముంచెత్తుతున్న శ్రియ సరన్..

Heart Attack Signs: హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలివే..!

Related Post