Breaking
Wed. Dec 4th, 2024

India: తిరిగి ప్రారంభం కానున్న అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు

flights

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ
India: అంత‌ర్జాతీయ విమాన రాక‌పోక‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. క‌రోనా నేప‌థ్యంలో తాత్కాలికంగా ఆంక్ష‌లు విధించిన అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను తిరిగి ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించింది. ఈ నెల 27 (మార్చి 27) నుంచి అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను తిరిగి ప్రారంభం కానున్నాయ‌ని కేంద్ర విమాన‌యాన శాఖ ప్ర‌క‌టించింది. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం అంత‌ర్జాతీయ విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు విధించిన సంగ‌తి తెలిసిందే. దాదాపు రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి.

ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌గ్గిపోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ నిర్ణ‌యంతో మ‌ళ్లీ విమాన‌యాన రంగం ఇబ్బందుల‌ను అధిగ‌మిస్తుంద‌ని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya M Scindia) పేర్కొన్నారు. విమాన‌యాన రంగ వ‌ర్గాల‌తో చ‌ర్చిన త‌ర్వాత‌.. క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టిన నేప‌థ్యంలో మేము మార్చి 27 నుండి అంతర్జాతీయ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్నాము అని తెలిపారు.

Share this content:

Related Post