Loading Now
Jammu And Kashmir Encounter

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..

ఏడాదిలో 100 మంది ముష్క‌రులు హ‌తం


ద‌ర్వాజ‌-శ్రీనగర్‌
Jammu And Kashmir Encounter: జమ్మూకాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత అక్కడి ఉద్రిక్త పరిస్థితులు, ఉగ్రకదలికలు తగ్గుముఖం పట్టినట్టు కనిపించింది. కానీ మళ్లీ అక్కడ ముష్క‌రుల క‌దలికలు మొదలయ్యాయి. తాజాగా జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని సొపోర్‌లో భద్రతా బలగాలకు, ఉగ్ర‌వాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్ర‌వాదులు హతమయ్యారు.

వివరాల్లోకెళ్తే.. సొపోర్‌లోని పీఠ్‌శీర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందుకున్న భద్రతాదళాలు.. అక్క‌డి చేరుకుని సోమవారం అర్ధరాత్రి సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తారసపడ్డ ముష్క‌రులు.. భద్రతాబలగాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ముష్క‌రుల‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు మ‌ట్టుబెట్టారు.

ఈ ఘ‌ట‌న గురించి జమ్మూకాశ్మీర్‌ పోలీసులు మాట్టాడుతూ.. ముగ్గ‌రు ఉగ్ర‌వాదులను మ‌ట్టుబెట్టిన‌ట్టు వెల్ల‌డించారు. అలాగే, ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైతం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కాగా, వారు ఏ ఉగ్ర సంస్థకు చెందినవారో గుర్తించాల్సి ఉందన్నారు. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Share this content:

You May Have Missed